6/10/2013 1:57:00 AM
మండపేట, న్యూస్‌లైన్ : టీడీపీ అధినేత చంద్రబాబు జిత్తులమారి నక్క అని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నింటి ధరలూ పెంచి పేదలనడ్డి విరుస్తున్నారని వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ధ్వజమెత్తారు. రైతులను అన్ని విధాలా ఆదుకున్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డేనన్నారు. రైతుల కోసం ఉచిత విద్యుత్, రుణమాఫీ, మద్దతు ధర పెంపు వంటి ఎన్నో నిర్ణయాలు తీసుకుని అమలు చేశారన్నారు. ‘మరో ప్రజాప్రస్థానం’లో భాగంగా ఆదివారం మండపేట కలువపువ్వు సెంటర్‌లో పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.
చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే వైఎస్ అధికారంలోకి వచ్చాక వారి కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పరిహారాన్ని అందజేశారన్నారు. ఐదేళ్ల పాలనలో ఏ విధమైన చార్జీలు పెంచకుండా వైఎస్ రికార్డు సాధించారన్నారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, రాజన్న అమలు చేసిన అన్ని సంక్షేమ పథకాలను జగన్ అమలు చేస్తారని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర అందేందుకు రూ.మూడు వేల కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటుచేస్తారని, రైతులకు వడ్డీలేని రుణాలు, పేదలందరికి పక్కా ఇళ్లు నిర్మిస్తారని హామీ ఇచ్చారు.ఇచ్చిన మాటకు కట్టుబడ్డందుకే వేధింపులుఅంతకు ముందు సీజీసీ సభ్యులు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ నల్లకాలువ వద్ద ఇచ్చిన మాటకు కట్టుబడి ఓదార్పు యాత్ర చేపట్టిన నాటి నుంచి కాంగ్రెస్ అధిష్టానం జగన్‌ను వేధింపులకు గురి చేయడం ప్రారంభించిందన్నారు. వైఎస్ అమలుచేసిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం కుదేలు చేసి పేదల ఆరోగ్యాన్ని గాలి కొదిలేసిందన్నారు. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గొల్ల బాబూరావు మాట్లాడుతూ వైఎస్‌కున్న జనాదరణతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆయన పథకాలను తుంగలో తొక్కి, ఆయన కుటుంబాన్ని ఇబ్బందుల పాల్జేస్తోందని విమర్శించారు. మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ పాలచర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ పాదయాత్రకు నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ కో ఆర్డినేటర్ రెడ్డి వీరవెంకట సత్యప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజా తీర్పుతో కాంగ్రెస్, టీడీపీలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మండపేటలో 4500 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వైఎస్ 122 ఎకరాలను సేకరించారన్నారు. వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ కర్రి పాపారాయుడు మాట్లాడుతూ పాదయాత్రను దిగ్విజయం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కిసాన్‌సెల్ జిల్లా కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ మాట్లాడుతూ సింహాన్ని బోనులో ఉంచి గుంటనక్కలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ కొల్లి నిర్మల కుమారి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, పార్లమెంటరీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు చలమలశెట్టి సునీల్, బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎంపీ ఏజేవీ బుచ్చిమహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు రెడ్డి ప్రసాద్, పాలచర్ల శ్రీనివాస్, మిండగుదిటి మోహన్, విప్పర్తి వేణుగోపాల్, మట్టా శైలజ, కొండేటి చిట్టిబాబు, చింతా కష్ణమూర్తి, తోట సుబ్బారావు నాయుడు, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ రొంగ లి లక్ష్మి, రాష్ర్ట సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టీకేవిశ్వేశ్వరరెడ్డి, వివిధ విభాగాల జిల్లా కన్వీనర్లు కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ, అనంత ఉదయభాస్కర్, మంతెన రవిరాజు, మట్టపర్తి మురళీకష్ణ, నలమాటి లంకరాజు, గారపాటి ఆనంద్, రావూరి వెంకటేశ్వరరావు, శెట్టిబత్తుల రాజబాబు, గుత్తుల రమణ, మార్గాని గంగాధర్, భూపతిరాజు సుదర్శన బాబు, అనపర్తి నియోజకవర్గ నాయకులు సత్తి సూర్యనారాయణరెడ్డి, కర్రి శేషారత్నం, కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి, జ్యోతుల నవీన్, జక్కంపూడి రాజా, ప్రత్యేక ఆహ్వానితులు తాడి విజయభాస్కరరెడ్డి, ఆర్‌వీవీ సత్యనారాయణచౌదరి పాల్గొన్నారు. |
No comments:
Post a Comment