భానుగుడి(కాకినాడ), న్యూస్‌లైన్ :అల్లూరి సీతారామరాజు కళావేదిక 29వ వార్షికోత్సవ సందర్భంగా ఆదివారం ఉదయం స్థానిక సూర్యకళామందిరంలో అల్లూరి వారసులను ఘనంగా సత్కరించారు. కళావేదిక వ్యవస్థాపక కార్యదర్శి పంపన దయానందబాబు అధ్యక్షతన అల్లూరి సీతారామరాజు చరిత్ర- చర్చావేదిక గింది. రాష్ట్రంలోని నలుమూలల్లో అల్లూరిపై పరిశోధన చేస్తున్నవారు ఈ కార్యక్రమంలో పాల్గొని తమతమ అభిప్రాయాలను పంచుకున్నారు. పార్లమెంట్‌లో అల్లూరి విగ్రహం ఏర్పాటుకు ఉద్యమాన్ని నిర్వహించాలని వేదిక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పడాల వీరభద్రరావు ప్రదర్శించిన ఛాయాచిత్ర ప్రదర్శనకు అనూహ్యస్పందన లభించింది.
అనంతరం నిర్వహించిన నాటికపోటీలు సామాజిక స్పృహను మేల్కొలిపాయి. శాలివాహన కళామందిర్-చెన్నూర్, నెల్లూరు జిల్లావారు ప్రదర్శించిన ‘మనిషికాటు’, సాయిఆర్ట్స్, కొలకలూరు గుంటూరుజిల్లా వారు ప్రదర్శించిన ‘ఒక్కమాటే చాలు’, విశాఖజిల్లా గోవాడ వారి శ్రీక్రియేషన్స్ ఆధ్వర్యంలో ‘బొమ్మ సముద్రం’ నాటికలు ఆహూతులను కట్టిపడేశాయి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు విచ్చేసి కళావేదిక సభ్యులను అభినందించారు. డాక్టర్ కె. శివాజీరాజు, పడాల వీరభద్రరావు, టీఎస్‌వీ ఆదిత్య శర్మ, తదితరులు పాల్గొన్నారు. టీఎల్ ఆచారి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

No comments:
Post a Comment