Monday, 10 June 2013

రక్కసి పాలన అంతానికే అవిశ్వాసం

6/10/2013 1:53:00 AM
సాక్షి, కాకినాడ : ప్రజల పక్షాన నిలబడి రాక్షసపాలనకు చరమగీతం పాడాలనే వైఎస్సార్ కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిందని, కానీ ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కాంగ్రెస్‌తో జత కలిసి ఆ పవిత్రకార్యాన్ని నీరుగార్చిందని కాకినాడ సిటీ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు.ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల కోసమే తాను అనర్హత వేటు వేయించుకోవడానికి వెనుకాడలేదన్నారు. రాష్ట్రాన్ని రక్షిస్తానని పాదయాత్ర చేసిన చంద్రబాబు కుట్ర రాజకీయం మానుకోనందునే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కొనసాగుతోందన్నారు. ఆయన వల్లే రాష్ట్ర ప్రజలు ఇన్ని అవస్థలు పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసిపోయి రాజకీయకుట్రలకు పాల్పడడం తప్ప అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజలు తన నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి త్వరలో ముఖ్యమంత్రి అయి, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తారన్నారు.

నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా..
ఈ నాలుగేళ్లలో అందరి మన్ననలు పొందుతూనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. దాదాపుగా రూ.130 కోట్ల నిధులు తెచ్చి డ్రైన్లు, రోడ్లు నిర్మించడమే - మిగతా 2లోఠ


కాక, 12, 13 ఆర్థిక సంఘాల నిధులతో నియోజకవర్గాన్ని అగ్రభాగాన ఉంచానన్నారు. దివంగత వైఎస్ హయాంలో నెల్లూరు, కాకినాడలకు మంచినీటి ప్రాజెక్టులు ప్రధానావసరంగా రూ. 242 కోట్లు వెచ్చించే పథకాలు మంజూరు కాగా ఇప్పుడు కార్యరూపం దాల్చే దశలో ఉన్నాయన్నారు. సిటీలో బైపాస్ రోడ్డు నిర్మాణం విషయంలో అనేక రకాల అంశాలు ఇమిడి ఉన్నందున ఒక కొలిక్కి రాలేదన్నారు. కాకినాడ-రాజమండ్రి కెనాల్ రోడ్డు విస్తరణ విషయంలో తన కృషి ఉందన్నారు. తాను చేసిన కృషిపై త్వరలో ‘డెవలప్‌మెంట్ బులెటిన్’ విడుదల చేస్తానన్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందోలేదో గ్రహించి ప్రజలే ఓటు ద్వారా తీర్పు ఇస్తారని పేర్కొన్నారు.

చంద్రబాబు చరిత్ర హీనులవుతారు..
‘పచ్చ’ పత్రికను అడ్డుపెట్టుకుని తనపై కొందరు పనిగట్టుకు ఆరోపణలు చేస్తున్నారని, ఇందుకు విరుగుడుగా- సీబీఐ అంటే కాంగ్రెస్ పార్టీది కనుక సిటింగ్ జడ్జితో విచారణ జరపమని డిమాండ్ చేస్తున్నానని ద్వారంపూడి చెప్పారు. ఎన్నికలు వచ్చేవరకు పార్టీ ఆదేశాలను పాటిస్తూ, ప్రభుత్వం తీసుకుంటున్న, తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతానన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీతో కుమ్మక్కై ప్రజలను ఎలా మోసం చేస్తోందో మరింతగా వివరిస్తానన్నారు. వైఎస్సార్ సీపీ అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టిన నాడు పాదయాత్రలో ఉన్న చంద్రబాబు సభకు హాజరు కాకుండా విప్‌జారీ చేసి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. ఆయన చరిత్ర హీనులుగా మిగిలిపోయే రోజు దగ్గరలోనే ఉందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు చెల్లుబోయిన వేణు, చలమలశెట్టి సునీల్, శెట్టిబత్తుల రాజబాబు, ద్వారంపూడి వీరభద్రారెడ్డి, కర్రి వీర్రెడ్డి (చినబాబు), గుత్తుల రమణ, అడ్డూరి ఫణీష్, ఇనుకొండపట్టాభి
రామయ్య, విజ్జపురెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
- See more at: http://www.sakshi.com/main/FullStory.aspx?catid=615396&subcatid=20&Categoryid=3#sthash.iNFnGeZI.dpuf

No comments:

Post a Comment