సాక్షి’ చైతన్యపథంలో వక్తలు
గూడూరు, న్యూస్‌లైన్ : ‘వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనలేక అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కుమ్మక్కై ఏడాదికి పైగా జైలు నిర్బంధంలో ఉంచడం ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలి పెట్టు చర్య వంటిది. జగన్ బయట ఉంటే ఈ పార్టీలు గల్లంతు కావడం ఖాయమన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక ప్రజలకు దూరం చేసేందుకు కుట్రపూరిత చర్యలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఏ నేరాలు రుజువు అయ్యాయని ఏడాదిగా జైలులో నిర్బంధించారు. కేంద్రం నియంతలా వ్యవహరిస్తోంది. తనకు ఎదురుతిరిగిన నేతలపై సీబీఐ అస్త్రాన్ని ప్రయోగిస్తూ కాలంగడుపుకుంటుంది’ అంటూ పలువురు న్యాయవాదులు, సామాజిక కర్తలు, విద్యావంతులు, ప్రజలు దుయ్యబట్టారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి రోటరీభవన్‌లో నిర్వహించిన చైతన్యపథం చర్చావేదికలో వక్తలు జగన్ అక్రమ నిర్బంధంపై ముక్తకంఠంతో ఖండించారు. ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించేం దుకు పెద్దఎత్తున తరలిరావడంతో రోటరీ భవన్ కిక్కిరిసింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మారిపోయిందన్నారు. జగన్‌ను రాజకీయంగా అణచివేసేందుకు జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతోందన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ నియంతలా వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో పుట్టగతులుండవన్నారు. ట్రాన్స్‌కో విశ్రాంత ఎస్‌ఈ సుందరరామిరెడ్డి మాట్లాడుతూ ఏ సంస్థలోనైనా పెట్టుబడులు పెట్టే స్వతంత్రం ప్రతి భారతపౌరుడికి ఉందన్నారు. పెట్టుబడులు పెట్టడం విరుద్ధమయితే ఆదాయపన్ను శాఖ ప్రశ్నించాలే కానీ సీబీఐ ఎందుకు చొరవ ప్రదర్శిస్తోందని ఆయన నిలదీశారు. సీబీఐ స్వయం ప్రతిపత్తితో వ్యవహరించాల్సి ఉండగా కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తూ యూపీఏకు ఎదురు తిరిగి మాట్లాడిన వారిపై దాడులు చేయడం దారుణమన్నారు. సామాజిక కర్త జానకిరాంరెడ్డి మాట్లాడుతూ ఏడాదిగా జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో ఉంచి బెయిల్ రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందన్నారు.
దేశంలో సీబీఐకీ ఎన్నో కేసులు ఉండగా ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి కేసునే ప్రత్యేకంగా ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. తమిళనాడులో డీఎంకే పార్టీ యూపీఏకు మద్దతు ఉపసంహరించిన మరుక్షణంలోనే ఆ పార్టీ నాయకులు స్టాలిన్ ఇంటిపై సీబీఐ దాడులు చేపట్టడాన్ని బట్టే ఎవరైనా సోనియాను ఎదిరిస్తే వారిపై సీబీఐ దాడులు తప్పవని దేశ ప్రజలందరికీ అర్థమైందన్నారు. పొదుపు సంఘం అధ్యక్షురాలు లలితమ్మ మాట్లాడుతూ ఎన్నో ప్రజాసంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో కొలువయ్యారన్నారు. ఆయన కుటుంబం పై ప్రజలకు పెరుగుతున్న ఆదరాభిమానాలను చూసి ఓర్వలేకే ఆ కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేస్తుందన్నారు. అందులో భాగంగానే జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకుంటుందన్నారు. కోటకు చెందిన రైతు చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ వివిధ కంపెనీలకు భూములను కేటాయించే సమయంలో కేవలం వైఎస్సార్ ఒక్కరే నిర్ణయం తీసుకోలేరని, కేబినెట్ ఆమోదం తెలిపాకే అలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నారు. ఈ నిర్ణయాలు కేబినెట్‌కు సంబంధం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
సీబీఐకు చిత్తశుద్ధి ఉంటే నిర్ణయం తీసుకున్న మంత్రులను కూడా జగన్ తరహాలనే విచారించాలన్నారు. ఈ చైతన్య పథంలో పాల్గొన్న మరి కొందరు వక్తలు మాట్లాడుతూ రాష్ట్రంలో, కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జగన్‌పై కేంద్ర స్థాయిలో కుట్రలు సాగుతున్నాయని తెలుస్తుందన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు కుట్రలు పరాకాష్టకు చేరుకుంటున్నాయన్నారు. జగన్‌పై కుట్రలు ఇక సాగబోవన్నారు.
- See more at: http://www.sakshi.com/main/FullStory.aspx?catid=611984&Categoryid=1&subcatid=33#sthash.7UDst2XA.dpufగూడూరు, న్యూస్‌లైన్ : ‘వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనలేక అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కుమ్మక్కై ఏడాదికి పైగా జైలు నిర్బంధంలో ఉంచడం ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలి పెట్టు చర్య వంటిది. జగన్ బయట ఉంటే ఈ పార్టీలు గల్లంతు కావడం ఖాయమన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక ప్రజలకు దూరం చేసేందుకు కుట్రపూరిత చర్యలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఏ నేరాలు రుజువు అయ్యాయని ఏడాదిగా జైలులో నిర్బంధించారు. కేంద్రం నియంతలా వ్యవహరిస్తోంది. తనకు ఎదురుతిరిగిన నేతలపై సీబీఐ అస్త్రాన్ని ప్రయోగిస్తూ కాలంగడుపుకుంటుంది’ అంటూ పలువురు న్యాయవాదులు, సామాజిక కర్తలు, విద్యావంతులు, ప్రజలు దుయ్యబట్టారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి రోటరీభవన్‌లో నిర్వహించిన చైతన్యపథం చర్చావేదికలో వక్తలు జగన్ అక్రమ నిర్బంధంపై ముక్తకంఠంతో ఖండించారు. ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించేం దుకు పెద్దఎత్తున తరలిరావడంతో రోటరీ భవన్ కిక్కిరిసింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మారిపోయిందన్నారు. జగన్‌ను రాజకీయంగా అణచివేసేందుకు జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతోందన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ నియంతలా వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో పుట్టగతులుండవన్నారు. ట్రాన్స్‌కో విశ్రాంత ఎస్‌ఈ సుందరరామిరెడ్డి మాట్లాడుతూ ఏ సంస్థలోనైనా పెట్టుబడులు పెట్టే స్వతంత్రం ప్రతి భారతపౌరుడికి ఉందన్నారు. పెట్టుబడులు పెట్టడం విరుద్ధమయితే ఆదాయపన్ను శాఖ ప్రశ్నించాలే కానీ సీబీఐ ఎందుకు చొరవ ప్రదర్శిస్తోందని ఆయన నిలదీశారు. సీబీఐ స్వయం ప్రతిపత్తితో వ్యవహరించాల్సి ఉండగా కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తూ యూపీఏకు ఎదురు తిరిగి మాట్లాడిన వారిపై దాడులు చేయడం దారుణమన్నారు. సామాజిక కర్త జానకిరాంరెడ్డి మాట్లాడుతూ ఏడాదిగా జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో ఉంచి బెయిల్ రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందన్నారు.
దేశంలో సీబీఐకీ ఎన్నో కేసులు ఉండగా ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి కేసునే ప్రత్యేకంగా ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. తమిళనాడులో డీఎంకే పార్టీ యూపీఏకు మద్దతు ఉపసంహరించిన మరుక్షణంలోనే ఆ పార్టీ నాయకులు స్టాలిన్ ఇంటిపై సీబీఐ దాడులు చేపట్టడాన్ని బట్టే ఎవరైనా సోనియాను ఎదిరిస్తే వారిపై సీబీఐ దాడులు తప్పవని దేశ ప్రజలందరికీ అర్థమైందన్నారు. పొదుపు సంఘం అధ్యక్షురాలు లలితమ్మ మాట్లాడుతూ ఎన్నో ప్రజాసంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో కొలువయ్యారన్నారు. ఆయన కుటుంబం పై ప్రజలకు పెరుగుతున్న ఆదరాభిమానాలను చూసి ఓర్వలేకే ఆ కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేస్తుందన్నారు. అందులో భాగంగానే జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకుంటుందన్నారు. కోటకు చెందిన రైతు చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ వివిధ కంపెనీలకు భూములను కేటాయించే సమయంలో కేవలం వైఎస్సార్ ఒక్కరే నిర్ణయం తీసుకోలేరని, కేబినెట్ ఆమోదం తెలిపాకే అలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నారు. ఈ నిర్ణయాలు కేబినెట్‌కు సంబంధం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
సీబీఐకు చిత్తశుద్ధి ఉంటే నిర్ణయం తీసుకున్న మంత్రులను కూడా జగన్ తరహాలనే విచారించాలన్నారు. ఈ చైతన్య పథంలో పాల్గొన్న మరి కొందరు వక్తలు మాట్లాడుతూ రాష్ట్రంలో, కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జగన్‌పై కేంద్ర స్థాయిలో కుట్రలు సాగుతున్నాయని తెలుస్తుందన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు కుట్రలు పరాకాష్టకు చేరుకుంటున్నాయన్నారు. జగన్‌పై కుట్రలు ఇక సాగబోవన్నారు.
No comments:
Post a Comment