6/10/2013 1:26:00 AM
జగన్, విజయసాయిలపై చంద్రబాబు గ్యాంగ్ అవాకులు
తర్వాత రెండ్రోజులకే అదే అంశంపై సీబీఐ మెమో దాఖలు ఉగ్రవాదుల విషయంలో కూడా ఇలాంటి మెమోలు దాఖలు చేయలేదు జగన్‌ను మానసికంగా వేధించి లబ్ధి పొందేందుకు కాంగ్రెస్-టీడీపీ కుట్ర సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆడిటర్ వి.విజయసాయిరెడ్డిలను ఒకే జైల్లో ఉంచవద్దని టీడీపీ నేతలు వ్యాఖ్యానించిన రెండు రోజుల్లోనే సీబీఐ వర్గాలు అదే విషయంపై కోర్టులో మెమో దాఖలు చేయడం చాలా ఆశ్చర్యంగా ఉందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. సీబీఐ ఇప్పటిదాకా ఎలాంటి కేసుల్లోనూ ఈ విధంగా మెమో దాఖలు చేయలేదని, ఉగ్రవాదుల కేసుల్లో కూడా ఇలాంటి మెమోలు దాఖలు కాలేదని గుర్తు చేశారు. సీబీఐ దాఖలు చేసే చార్జిషీట్లన్నింట్లోనూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నోట్స్‌లోని అంశాలే ఉంటున్నాయని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం అంబటి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘రెండ్రోజుల క్రితం చంద్రబాబు చెంబు గ్యాంగ్ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టారు. జగన్, సునీల్, విజయసాయిరెడ్డి ఒకే జైల్లో ఉంటే ఎలాగని, కేసు నుంచి తప్పించుకోవడానికి ముగ్గురు కలిసి ప్రయత్నం చేస్తారని మాట్లాడారు. అనంతరం సరిగ్గా అవే అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కోర్టులో సీబీఐ మెమో దాఖలు చేసింది. చెంబు గ్యాంగ్ బయట అరవడం, సీబీఐ వాటిని అమలు చేయడం... ఇందతా చూస్తుంటే ఈ కథ మొత్తాన్నీ బాబే నడిపిస్తున్నారని ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది’’ అన్నారు. అలాగే చంచల్‌గూడ జైలు విషయంలో టీడీపీ రోజూ ఏదో రాద్ధాంతం చేయడాన్ని సాకుగా చూపి అధికారులు మరిన్ని నిబంధనలు విధిస్తున్నారన్నారు. ‘‘వీరి వాలకం చూస్తుంటే జగన్ ఎవరినీ కలవకూడదంటూ అండమాన్ జైలుకు పంపాలని కోరుకునేలా కనిపిస్తోంది. ఇదంతా జగన్‌ను మానసికంగా వేధించి రాజకీయ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్‌తో కలిసి బాబు ఆడిస్తున్న డ్రామా. రెండు పార్టీలు కలిసి జగన్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు సీబీఐని, పోలీసు యంత్రాంగాన్ని వాడుకోవడం దురదృష్టకరం. ఆయనను జైల్లో వేసినా బాబు రాక్షస మనసుకు కక్ష తీరడం లేదు. అత్యంత హీనంగా మద్యం, నీలిచిత్రాలంటూ నీతి బాహ్యంగా మాట్లాడుతున్నారు. అధికార దాహంతో బాబు రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన సందర్భంలో కూడా వారి కుటుంబసభ్యులను చీల్చి మానవతా విలువలను బాబు మంటగ లిపారు. ఎన్టీఆర్‌ను దించేయడానికి ఆయన అవలంబించిన దౌర్భాగ్య విధానాలన్నింటినీ రాష్ట్ర ప్రజలు కళ్లారా చూశారు’’ అంటూ అంబటి ధ్వజమెత్తారు. కుళ్లు, కుతంత్రాలతో నిండిన బాబు తల 2014 తర్వాత ప్రజల చేతిలో రాజకీయంగా వెయ్యి ముక్కలు కాక తప్పదన్నారు. చదవేస్తే... టీడీపీ నేత యనమల రామకృష్ణుడు పరిస్థితి చదవేస్తే ఉన్న మతి పోయిందన్నట్టు తయారైందని అంబటి ఎద్దేవా చేశారు. ‘‘న్యాయవాద విద్య నేర్చి, అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసిన యనమలకు జైలు నిబంధనలు తెలియవా? జగన్ శిక్షపడిన ఖైదీకాదు. కేవలం ఆరోపణలకు గురైన వ్యక్తి మాత్రమే. కేసులో సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న సీబీఐ అభియోగాలపై మాత్రమే ఆయనను నిర్బంధిం చారు. ఈ కనీస జ్ఞానం కూడా యనమలకు లేదా? జగన్ ములాఖత్‌లపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. జగన్ రాజకీయ నాయకుడు. ములాఖత్ ద్వారా నేతలను కలిస్తే తప్పేమిటి? రాజకీయ కార్యకలాపాలు నడపొద్దని ఎక్కడైనా ఉందా?’’ అని యనమలను ప్రశ్నించారు. చంద్రబాబు రచించే కుట్రలు, కుతంత్రాలను మొదటి నుంచీ దగ్గరుండి అమలు చేసిన ఘనత యనమలకు ఉందని అంబటి ఆరోపించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవటంలో బాబు చేతిలో యనమల ఆయుధంగా పనిచేశారని, అప్పట్లో స్పీకర్‌గా ఆయన అడుగులకు మడుగులొత్తారని దుయ్యబట్టారు. ఇక చెంబు గ్యాంగ్‌లోని వర్ల రామయ్య జగన్ సతీమణి వైఎస్ భారతిపై సభ్యత, సంస్కారం లేని నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆమె పోలీసులను కొట్టారనడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘తన తండ్రిని నెడుతుంటే, అన్నా మా నాన్నను తోయొద్దంటూ వీపు తడితే దాన్నీ రాజకీయం చేస్తున్నారు. ఈ ఉదంతంపై పోలీసులు ఇప్పటిదాకా ఏమీ మాట్లాడలేదు కూడా’’ అని గుర్తు చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలే గానీ పిరికిపందల్లా మీడియా, పోలీసుల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం సిగ్గుచేటంటూ ధ్వజమెత్తారు. ‘సీబీఐ సూత్రధారులపై’ దర్యాప్తు జరగాలి సీబీఐ వెనక ఉండి దాన్ని నడిపిస్తున్న వ్యక్తులపై దర్యాప్తు జరగాలని అంబటి డిమాండ్ చేశారు. జగన్ కేసు వెనక ఉన్నది చంద్రబాబా, కిరణా, లేక సోనియాగాంధియా అనేది తేలాలన్నారు. ‘‘2014 తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూలిన తర్వాత అయినా వాస్తవాలు బయటకు రాక తప్పదు. దీని వెనక నడిపిస్తున్న బాబు, కాంగ్రెస్ పెద్దల బాగోతాలు ఏదో ఒక క్షణంలో బయటికొస్తాయి. న్యాయవ్యవస్థపై నమ్మకముంది. న్యాయం, ధర్మం కచ్చితంగా గెలిచి తీరతాయి. బాబు, కాంగ్రెస్ నేతలు ప్రతిఫలం అనుభవించక తప్పదు. ఇప్పటికైనా ధర్మం, న్యాయాలను అనుసరిస్తే వారికి కనీసం పుట్టగతులైనా ఉంటాయి’’ అన్నారు. ఆనం సోదరులకు పిచ్చి ముదిరినట్టుందని ఒక ప్రశ్నకు బదులుగా అంబటి చెప్పారు. 2014 తర్వాత మొత్తం దిగుతుందన్నారు. |
No comments:
Post a Comment