6/8/2013 4:12:00 AM
‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డిని జైల్లో పెట్టామని కాంగ్రెస్, టీడీపీ సంబరపడుతున్నాయి. జగన్‌మోహన్‌రెడ్డిని కాదు జనాన్ని, జనం కలల్ని జైల్లో పెట్టారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు నిశ్శబ్దంగా తమ ఓటు హక్కుతో ప్రజా వ్యతిరేక పాలకులకు బుద్ధి చెబుతారు. సీబీఐ పెట్టిన కేసులన్నీ రాజకీయ కక్ష సాధింపుతోనే అని ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ర్టంలో చిన్న పిల్లవాడిని అడిగినా జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో ఎవరు? ఎందుకు? పెట్టారో చెబుతారు. అరచెయ్యి అడ్డుపెట్టి సూర్యుడ్ని ఆపలేరు.’ ఇవీ శుక్రవారం మదనపల్లెలో నిర్వహించిన చైతన్యపథం సదస్సులో వక్తల అభిప్రాయాలు. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే... మంత్రులకో న్యాయం జగన్‌కో న్యాయమా? వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో 2004లో క్యాబినెట్లో చర్చించి నిర్ణయాలు తీసుకున్న మంత్రులు సచ్చీలురా? ఆనాడు మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలకు జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధం ఏమిటి? మంత్రులకు సంబంధం లేకపోతే.. జగన్‌మోహన్‌రెడ్డికి ఏం సంబంధం? ఇదెక్కడి న్యాయం. చంద్రబాబు హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయి. ఆయనపై విచారణ కోరితే సిబ్బంది లేరని సీబీఐ తప్పుకుంటుంది. అదే జగన్ విషయంలో ఆగమేఘాలమీద విచారణ ప్రారంభించి, లేనిపోని అభియోగాలు మోపి అరెస్టు చేసింది. తండ్రి మాట విని ఆనాడు రాముడు అడవులకు వెళ్లాడు. ప్రజలకిచ్చిన మాటను నెరవేర్చేందుకు ఓదార్పుయాత్ర చేసి జగన్ ఈనాడు జైలుకు వెళ్లాడు. ప్రజల గుండెల్లో జగన్‌కు రాముడికుండే స్థానం ఉంది. - బీఎస్‌ఆర్ ప్రసాద్, ఇంజినీరింగ్ కాలేజ్ లెక్చరర్, సీటీఎం పౌర స్వేచ్ఛను హరిస్తున్నారు ప్రజాస్వామ్యంలో పౌరుడికి ఉండే స్వేచ్ఛను హరిస్తున్నారు. నేడు యావత్ భారతదేశంలో ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా జైల్లో పెట్టడం గురించే చర్చిస్తోంది. సోనియా, కిరణ్, చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలు ప్రజలు అర్థం చేసుకున్నారు. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక అసువులు బాసిన వారి కుటుంబాలను ఓదార్చుతున్న జగన్‌మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న అభిమానాన్ని కాంగ్రెస్ అధిష్టానం సహించలేకపోయింది. సొంతంగా పార్టీ పెట్టుకున్నారనే అక్కసుతో కుట్రపన్ని సీబీఐ కేసుల్లో ఇరికించింది. పదికోట్ల ఆంధ్రుల శక్తి జగన్‌మోహన్ రెడ్డి. ఆయన త్వరలోనే బయటకు వచ్చి తనను నమ్ముకున్న వారిని కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు. సీబీఐ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారింది. ఇదెంతో కాలం కొనసాగదు. - జింకా వెంకటాచలపతి, ట్రేడ్ యూనియన్ నాయకుడు, మదనపల్లె బెయిల్ ఇవ్వకపోవడం కక్షసాధింపే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎవరైనా ఏదేని కేసులో అరెస్టయితే 90రోజుల తరువాత బెయిల్‌పై విడుదలయ్యే హక్కు ఉంది. ప్రజల తరుపున నిలబడిన జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రం బెయిలు ఇవ్వకుండా ఏడాదిగా జైల్లోనే ఉంచడం కక్షపూరిత చర్య. దీన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి. రాబోయే ఎన్నికల్లో ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డి పక్షాన నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వానికి,ప్రతిపక్ష టీడీపీకి బుద్ధి చెబుతారు. - సునీత, గృహిణి, ఆరోగ్యవరం జగన్ వ్యక్తి కాదు శక్తి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక వ్యక్తి కాదు శక్తి. జైలుగోడలు, నిర్భంధాలు జగన్‌ను ఏమీ చేయలేవు. ఆడపడుచుల అన్న జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే జనం మధ్యలోకి వస్తాడు. ఆడవాళ్ల కన్నీళ్లను తుడుస్తాడు. ఎవరెన్ని కేసులు పెట్టినా జగన్‌మోహన్‌రెడ్డిని ఎవరూ ఏమీ చేయలేరు. సత్యం, ధర్మం ఆయన పక్షాన ఉన్నాయి. చేయని తప్పులకు వేధింపులకు గురిచేసిన వారే ప్రజాగ్రహానికి కొట్టుకుపోతారు. - సత్య, గృహిణి, మదనపల్లె రైతు పక్షపాతి వైఎస్సార్ చిన్ననాటి నుంచే రైతులు పడ్డ కష్టాలను దివంగత వైఎస్‌ఆర్ ప్రత్యక్షంగా చూశారు. తాను వ్యవసాయం చేయడంతో వాటిలో కష్టనష్టాలు ఆయనకు తెలుసు. కాబట్టే రైతు సంక్షేమం కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఉచిత విద్యుత్‌ను ప్రవేశపెట్టారు. రైతుల రుణాలను మాఫీ చేయడంతో ఎంతో మంది కన్నీళ్లను తుడిచారు. వైఎస్‌ఆర్ అకాల మరణంతో ఆయన తనయుడు రైతులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూడలేక కేంద్రంలోని పెద్దలు, రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ ఏకమై ఆయనపై కేసులు బనాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెన్నుపోటుదారుడైన చంద్రబాబు ఏకమైనా ప్రజలు వారి కుయుక్తులను అడ్డుకుని వారి కుట్రలను అంతం చేస్తారు. - గౌరీ శంకర్‌రెడ్డి, రైతు, ములకలచెరువు |
No comments:
Post a Comment