Saturday, 8 June 2013

వైఎస్ కుటుంబానికి అండగా ఉంటాం

6/8/2013 4:05:00 AM
=వైఎస్ కుటుంబానికి అండగా ఉంటాం

=జగన్‌తోనే రైతులకు, మహిళలకు భరోసా

=కాంగ్రెస్, టీడీపీలకు ఓటుతో జవాబు చెబుతాం

=మదనపల్లె చైతన్యపథంలో వక్తలు


‘‘సత్యం, ధర్మం జగన్‌మోహన్‌రెడ్డి పక్షాన ఉన్నాయి. కాంగ్రెస్ అధిష్టానం కక్షసాధించేందుకు ఆయనపై కేసులు పెట్టింది. ఏడాదిగా జైల్లో ఉంచి అయిన వారికి దూరం చేసింది. బెయిల్ రాకుండా కాంగ్రెస్, టీడీపీ అడ్డుపడు తున్నాయి.’’ ఇదీ ‘సాక్షి’ చైతన్యపథంలో పాల్గొన్న జనం మనోగతం.

మదనపల్లె, న్యూస్‌లైన్: అధికార పదవులు అనుభవించని జగన్ మోహన్‌రెడ్డి అవినీతికి ఎలా పాల్పడుతారో కాం గ్రెస్, టీడీపీ, సీబీఐ పెద్దలకే తెలియాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం మదనపల్లెలోxసాక్షిరూ. ఆధ్వర్యంలో చైతన్యపథం సదస్సు నిర్వహించారు. సదస్సుకు వ్యాఖ్యాతగా నరసింహారావు వ్యవహరించారు. సదస్సులో వివిధ వర్గాలకు చెం దిన మేధావులు, న్యాయనిపుణులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల నాయకులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. సీబీఐ జగన్‌మోహన్‌రెడ్డిపై పలు కేసులు పెట్టి ఒక్కొక్క కేసుకు ఒక్కొక్క చార్జిషీటు దాఖలు చేస్తామనడం న్యాయబద్ధం కాదని పలువురు అభిప్రాయపడ్డారు. జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేసి ఏడాది కావొస్తున్పప్పటికీ బెయిల్ ఇవ్వకపోవడం ఆయనకు రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాయడమేనని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులను కల్పించిందని, జగన్‌మోహన్ రెడ్డి కేసు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా కొనసాగుతోందని వారు అన్నారు. సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా కొనసాగడం లేదనేందుకు పలు ఉదాహరణలున్నాయన్నారు. విచారణ పేరుతో జగన్‌మోహన్‌రెడ్డిని ఏడాదిగా జైల్లో ఉంచారని, ఆయనపై పెట్టిన కేసులు వీగిపోతే ఈ రిమాండ్ కాలాన్ని సీబీఐ ఆయనకు ఏ విధంగా తిరిగి ఇస్తుందని వారు ప్రశ్నించారు. జగన్‌మోహన్ రెడ్డిని ఏడాది పైబడి జైలులో ఉంచి బిడ్డలకు తండ్రిని, తల్లికి బిడ్డను, భార్యకు భర్తను దూరం చేశారని పలువురు మహిళలు కన్నీరుమున్నీరయ్యారు. కనీసం మానవత్వం, దయాదాక్షిణ్యాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడాన్ని మానవతావాదులంతా గర్హించాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతన్నలకు ఇచ్చిన భరోసానే జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చారని దీంతో ఆయనలో వైఎస్‌ను ప్రజలు చూసుకుంటున్నారన్నారు.

జగన్‌మోహన్ రెడ్డిని ప్రజలకు దూరం చేసిన అధికార, ప్రతిపక్ష పార్టీలకు పుట్టగతులుండవని పలువురు మహిళలు శాపనార్థాలు పెట్టారు. ప్రజానాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కుట్రలతో జైలులో బంధించినా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలకు ఓటుతో బుద్ధి చెబుతామని సభలో పాల్గొన్న వివిధ వర్గాల ప్రజలు హెచ్చరించారు. ప్రజలంతా వైఎస్ కుటుంబానికి అండగా ఉన్నారంటూ వారిని ప్రజల నుంచి దూరం చేయడం ఏదుష్ట శక్తి వల్లా కాదని స్పష్టం చేశారు. చర్చావేదికలో వివిధ వర్గాలకు చెందిన యహసానుల్లా, శివారెడ్డి, యమలా సుదర్శనం, అమీన్‌పీర్, జేడీ ప్రేమ, ఎర్రయ్య, గోవిందరెడ్డి, గౌరీశంకర్‌రెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డి, చంద్రశేఖర్, సునిత, సంధ్య తదితరులు పాల్గొన్నారు.
- See more at: http://www.sakshi.com/main/FullStory.aspx?catid=614379&Categoryid=1&subcatid=33#sthash.5g1h7v7F.dpuf

No comments:

Post a Comment