6/11/2013 4:17:00 AM
*జననేతను కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ, ఎల్లో మీడియా ఏమి చేయలేవు
*ఒక్క జగన్‌ను ఎదుర్కొనేందుకు ఇంతమంది కుమ్మక్కు కావాలా! *ఏం తప్పుచేశారని ఇన్నాళ్లు జైల్లో పెడతారు..? *ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడినందుకా? లేక మీ మాట విననందుకా? *కదిరిలోనిర్వహించిన ‘సాక్షి’ చైతన్యపథంలో నిప్పులు చెరిగిన ప్రజలు ‘రాష్ట్రంలోని ప్రతి ఇల్లూ ఏదో ఒక పథకం వల్ల లబ్ధిపొందేలా పాలన సాగించిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి భార్య, కుమారున్ని.. టీడీపీతో కుమ్మక్కు అయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐని అడ్డుపెట్టుకుని ఇక్కట్ల పాలు చేస్తోంది.. కాంగ్రెస్ సీఎంగా పని చేసిన మహానేత.. భార్య, కూతురు, కోడలు న్యాయం కోసం వీధిలో ధర్నాకు దిగే దౌర్భాగ్యపు పరిస్థితిని కల్పించింది కేంద్ర, రాష్ట్రంలోని అదే కాంగ్రెస్ ప్రభుత్వం కాదా.. ఆరు నెలల తర్వాత జననేత జగన్‌ను కోర్టుకు తీసుకువస్తుంటే తనివితీరా చూద్దామని ఎక్కడెక్కడినుంచో తరలి వచ్చిన జనాన్ని పోలీసులు కొట్టడం సమంజసమా.. కుట్ర పన్ని జగన్ మోహన్ రెడ్డిని జైలులో పెట్టినా, జనం ఓట్లను జైలులో పెట్టగలరా..’ అంటూ వక్తలు ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. కదిరి, న్యూస్‌లైన్: ‘ఏం తప్పు చేశాడని వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేసి జైల్లో పెడతారు.. రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని ఇంత ఇబ్బంది పెడతారా? నల్లకాలువలో జగన్ ప్రజలకిచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర చేయడమే తప్పా’ అని కదిరిలో సోమవారం సాక్షి నిర్వహించిన ‘చైతన్య పథం’లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ కుటుంబానికి జరుగుతున్న అన్యాయం, కుట్రలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, సీబీఐ పనితీరును తూర్పారబట్టారు. వ్యాఖ్యాత ఎం.నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ చైతన్యపథంలో ముస్లిం మత పెద్ద మౌలానా ఇస్మాయిల్, న్యాయవాది నాగేంద్రరెడ్డి, రాష్ట్ర చేనేత సంఘం కార్యదర్శి ఇంద్రావతమ్మ, విద్యావేత్త శివారెడ్డి, బీటెక్ విద్యార్థిని కీర్తి మానస, మాలమహానాడు జిల్లా కార్యదర్శి రామచంద్ర, మేధావులు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలలో వైఎస్ కుటుంబానికి ఉన్న అభిమానం చూసి ఓర్వలేకనే ఇలాంటి కుట్రలు పన్నుతోందన్నారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ బెంగుళూరులో వ్యాపారం చేసుకుంటున్నాడని, ఏ ఒక్కరోజు కూడా సచివాలయంకు కానీ, ఏ అధికారికి కానీ ఫోన్ చేసి తనకు ఈ పనిచేసిపెట్టమని అడిగిన సందర్భాలు లేవన్నారు. నల్లకాలువలో జగన్ ఇచ్చిన మాట మేరకు ఓదార్పు యాత్ర చేపట్టినప్పటి నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కన్నుకుట్టిందన్నారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి 90 రోజులలోపు చార్జిషీట్ వేయకపోతే బెయిల్‌కు అర్హుడని చట్టాలు చెబుతున్నా.. అవి జగన్ విషయంలో అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ను అరెస్ట్ చేసి సంవత్సరం గడిచినా ఇప్పటి వరకు తుది చార్జిషీట్ తయారు చేయలేదంటే ఆయన్ను మానసికంగా ఎంతగా వేధిస్తున్నారో సామాన్యులకు సైతం అర్థమవుతోందన్నారు. జగన్‌కు బెయిల్ రాకుండా చేయడానికి ముక్కలు ముక్కలుగా చార్జిషీట్ వేయడం ఎంత వరకు సబబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దరాప్తు ఎక్కడా చూడలేదన్నారు. జగన్‌పై కేసు నమోదై మూడు సంవత్సరాలు పూర్తయినా ఇంకా దర్యాప్తు కొనసాగుతోందంటూ సీబీఐ ఎవరి కోసం కాలయాపన చేస్తోందో చదువు రాని వారికి కూడా ఇట్టే తెలుస్తోందన్నారు. సీబీఐ పంజరంలో చిలుక అని సాక్షాత్తు సుప్రీంకోర్టే చెప్పిందంటే దానిమీద ఎవరు పెత్తనం చెలాయిస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కరలేదన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ మీద అక్రమ ఆస్తుల అభియోగం మీద సీబీఐ చార్జ్‌షీట్ వేసిందని, అయితే యుపీఏకు మద్దుతు ఇచ్చాడన్న ఒకే కారణంతో అలాంటి ఆస్తులేమీ లేవని తేల్చిందని, మద్దతు ఉపసంహరించుకున్న తరువాత మళ్లీ ఆయనపై చార్జ్‌షీట్ వేసిందన్నారు. గతంలో జయలలిత, మాయవతి, కరుణానిధి ఇలా దేశంలోని పలువురిపై కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేకపోతే ఏదో విధంగా వారిపై సీబీఐ దాడులు చేపించిన చరిత్ర కాంగ్రెస్‌దేన్నారు. సీబీఐ లాయర్ అశోక్‌భాన్ రాజకీయనేతలా మాట్లాడుతున్నాడని పలువురు వక్తలు దుయ్యబట్టారు. | |
No comments:
Post a Comment