6/11/2013 4:32:00 AM
‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ అడుగులకు టీడీపీ మడుగులొత్తుతోంది. మాట వినని వారిని ఏం చేయడానికైనా వెనకాడటం లేదు. జననేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఉన్న ప్రజాదరణ చూసి జీర్ణించుకోలేని కాంగ్రెస్, టీడీపీలు... ఎలాగైనా దెబ్బతీయాలని కుట్రలు పన్నాయి. నేరుగా ఎదుర్కొంటే ప్రజలు గుణపాఠం చెబుతారని భావించి జిత్తులమారి నక్కలుగా వెన్నుపోటుకు దిగాయి. అందుకు సీబీఐని పావుగా వాడుకున్నాయి. జగన్‌పై అక్రమ కేసులు బనాయించి.. ఏడాదిగా జైలుపాలు చేశాయి. ఈ కుట్రలు, కుతంత్రాలకు సమాధి కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయం’టూ జనం గళమెత్తారు. కదిరి పట్టణంలో వ్యాఖ్యాత ఎం.నాగరాజు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘సాక్షి చైతన్య పథం’లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. వైఎస్ కుటుంబంపై జరుగుతున్న కుట్రలు, అన్యాయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, సీబీఐ తీరును కడిగి పారేశారు. జగన్‌ను నిర్బంధించడం ముమ్మాటికీ కక్ష సాధింపేనని అభిప్రాయపడ్డారు. ప్రజలకు మేలు చేస్తే కష్టాలా? మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 104, 108, ఆరోగ్యశ్రీ పథకాలతో పేదలకు ఖరీదైన వైద్యం అందుబాటులోకి తెచ్చారు. పావలావడ్డీతో మహిళలకు రుణాలిచ్చారు. రైతుల రుణాలు మాఫీ చేశారు. వైఎస్ మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి బాటలో నడుస్తూ పేదల పక్షాన నిలిచారు. ప్రజల్లో ఆయనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీ కుట్రపన్ని జైల్లో పెట్టించాయి. ప్రజలంతా జగన్ వెంటే ఉన్నారు. ఆయనను వెంటనే విడుదల చే యాలి. - ముషీదా, గృహిణి కుట్రతో నిర్బంధించారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కుట్రలు చేస్తున్నారు. జగన్‌పై వచ్చిన ఆరోపణల్లో ఇంతవరకు ఏ ఒక్క దానికీ ఆధారం లభించకపోయినా ఏడాదికి పైగా జైల్లో నిర్బంధించారు. ఇలాంటి చర్యలు చట్టానికి వ్యతిరేకం. ఇలాం టి వా టి వల్ల చట్టంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది. జగన్ న్యాయబద్ధంగా అన్ని పన్నులూ చెల్లించారు. అదే రామోజీ ఎన్ని అక్రమాలకు పాల్పడినా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. - గజ్జెల రవీంద్రారెడ్డి, రైతు బాబుకో న్యాయం, జగన్‌కో న్యాయమా? చంద్రబాబు రూ.వేల కోట్లు సంపాదించారని, ఆయనపై విచారణ జరపాలని ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. అదే జగన్‌పై రాజకీయ దురుద్దేశంతో ఒకరిద్దరు ఫిర్యాదు చేయగానే ఆగమేఘాలపై విచారణ చేపట్టారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ చదువు కోసం ‘సత్యం’ రామలింగరాజు విదేశాల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అది క్విడ్‌ప్రో కో కాదా? లాభాలు ఆశించి జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే క్విడ్‌ప్రోకో అంటూ విష ప్రచారం చేయడం న్యాయమా? పేద విద్యార్థులు ధనికుల పిల్లలతో సమానంగా చదువుతున్నారంటే ఆ మహానేత చలవే. అలాంటి పథకాన్ని నీరుగార్చే విధంగా కిరణ్ సర్కారు అనేక షరతులు విధిస్తోంది. - కవితారెడ్డి, డిగ్రీ విద్యార్థిని |
No comments:
Post a Comment