Tuesday, 11 June 2013

కాంగ్రెస్ బీజేపీ గురించి ఆలోచించటం ఏంటి?:నక్వీ

న్యూఢిల్లీ : తమ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్‌ పార్టీ నేతలు గత కొద్ది రోజులుగా మనోవేదనకు గురవుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ ఎద్దేవా చేశారు. తమ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సలహా ఇచ్చారు. ఇందుకు బదులుగా దేశ పాలనపై దృష్టి నిలిపితే బాగుటుందన్నారు. కుంభకోణాలు జరగకుండా... అవినీతికి పాల్పడకుండా కాంగ్రెస్‌ పార్టీ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదన్నారు. బీజేపీకి బద్ధశత్రువైన కాంగ్రెస్‌ తమ గురించి ఆలోచించడం ఏమిటని నక్వీ ప్రశ్నించారు.

No comments:

Post a Comment