Monday, 10 June 2013

రాజన్న దయతో పున ర్జన్మ

6/10/2013 1:58:00 AM
జగనన్న ఎప్పుడొస్తాడమ్మా?
‘అమ్మా.. మా జగనన్న ఎప్పుడొస్తాడమ్మా?’ అంటూ మహేంద్రవాడకు చెందిన వికలాంగుడు కొవ్వూరి ఆదిరెడ్డి అర్తమూరులో షర్మిలను ఆవేదనతో అడిగాడు. ‘ఇడుపులపాయ నుంచి ఇక్కడి వరకు మా కోసం వచ్చావామ్మా’ అంటూ కంటతడి పెట్టిన ఆదిరెడ్డిని షర్మిల ఆప్యాయంగా పలకరించారు. త్వరలోనే మనందరి కష్టాలు తీరుతాయని, జగనన్న బయటకు వస్తారని ధైర్యం చెప్పారు.

కొద్దిరోజులు ఓపిక పట్టండి..
బతుకు తెరువు కోసం శ్రీకాకుళం నుంచి వలస వచ్చామని, తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని అర్తమూరు సమీపంలోని ఇటుకబట్టీ కార్మికులు నల్లమిల్లి వీరయమ్మ, ముర్రా పార్వతి, కిలారి మహాలక్ష్మి షర్మిలకు తమ గోడు వినిపించారు. ‘జగనన్న పాలనలో మంచి రోజులు వస్తాయమ్మా! జగనన్నను ఆశీర్వదించండి. మరో కొద్దిరోజులు ఓపిక పట్టండి.’ అంటూ షర్మిల వారికి భరోసా నిచ్చారు.

రాజన్న రాజ్యం తెస్తాడన్న నమ్మకంతో ఉన్నాం..
పొలమూరు సెంటర్ వద్ద తన కోసం ఎదురు చూస్తున్న మహిళలను షర్మిల ‘బాగున్నారామ్మా!’ అని పలకరించారు. దాంతో అచ్చి దుర్గ, మారుబోయిన వీరలక్ష్మి తదితరులు ‘ఏముందమ్మా! కరెంటు బిల్లులు, నిత్యావసర ధరలు పెరిగిపోయి బతుకుభారంగా మారింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న వస్తాడని, రాజన్న రాజ్యం తెస్తాడనే నమ్మకంతో ఉన్నామని, ఆయన పాలన కోసం ఎదురుస్తున్నామని అన్నారు. జగనన్న త్వరలోనే బయటకు వస్తారని, రాజన్న రాజ్యం తెచ్చేందుకు కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెబుతూ జగనన్నను ఆశ్వీరదించాలని షర్మిల కోరారు.

ఆడపడుచుకు ఆత్మీయ సత్కారం
షర్మిలకు అర్తమూరులో ఆత్మీయ సత్కారం లభించింది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం పాదయాత్రను ప్రారంభించిన షర్మిల దుర్గమ్మ గుడికి చేరుకుని అక్కడి వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ క ర్రి పాపారాయుడు తొలిసారి గ్రామానికి వచ్చిన షర్మిలను ‘మా ఇంటి ఆడపడుచు’ అంటూ చీర, రవికెల గుడ్డ, పసుపు, కుంకుమలతో పాటు రుచికి పేరొందిన తాపేశ్వరం కాజా అందజేశారు.

- మండపేట రూరల్, న్యూస్‌లైన్
రాజన్న దయతో పున ర్జన్మ
పొలమూరులో షర్మిలను కలసిన సత్తి శ్రీలక్ష్మి అనే బాలిక రాజన్న దయవల్లే తనకు రూ.లక్ష ఖరీదైన గుండె శస్త్ర చికిత్స హైదరాబాదు యశోదా ఆస్పత్రిలో జరిగిందని చెప్పింది. తనలా మరెందరో చిన్నారుల ప్రాణాలు నిలవాలంటే జగనన్న సారథ్యంలో రాజన్న పాలన తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపింది.

తిరిగి రైతే రాజవుతాడు..
రామవరం రోడ్లో మల్లిడి అప్పారెడ్డి అనే రైతును షర్మిల ‘బాగున్నారా’ అని పలకరించగా మహానేత పాలనలో వ్యవసాయం గిట్టుబాటయ్యిందని, ప్రస్తుతం పెరిగిన ఎరువులు, పురుగు మందుల ధరలతో గిట్టుబాటు కావడం లేదని చెప్పాడు. రానున్న రాజన్న రాజ్యంలో తిరిగి రైతే రాజవుతాడని షర్మిల భరోసా ఇచ్చారు.
- బిక్కవోలు, న్యూస్‌లైన్

No comments:

Post a Comment