Monday, 10 June 2013

పొలాల్లో విరబూసిన కల్మషం లేని నవ్వులు

6/10/2013 2:07:00 AM
-‘మరో పజా ప్రస్థానం’కు పోటెత్తిన జనం
-మహానేత తనయపై ఉప్పొంగిన అభిమానం
-జగన్ రాక, రాజన్న రాజ్యాల కోసం ఆరాటం

సాక్షి, మండపేట : ఆమెకు ఎలాంటి పదవీ, అధికారం లేవు.. ఉన్నది ఒకే ఒక్క హోదా.. పేదల గుండెల్లో కొలువైన రాజన్న కూతురు, జననేతగా ఎదిగిన జగనన్న చెల్లెలు. తమ కష్టాలు చెప్పుకునేందుకు ఆ హోదాయే చాలంటున్నారు ప్రజలు. కార్మికులు, కర్షకులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులు ఇలా ప్రతి ఒక్కరూ ఆమెకు తమ సమస్యలు చెప్పాలని పోటీ పడుతున్నారు. అలా చెప్పుకోగానే వారి కళ్లలో కొండంత అండ లభించిందన్న ఆనందం తొణికిసలాడుతోంది.
కాంగ్రెస్ ప్రజాకంటకపాలన, చంద్రబాబు కుట్రరాజకీయాలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు జిల్లాలో ప్రజాదరణ ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టు వర్ధిల్లుతోంది. మహానేత బిడ్డను చూసేందుకు, ఆమెతో కరచాలనం చేసేందుకు అందరూ ఆరాటపడుతున్నారు. ఆదివారం నాటి ఆరవరోజు పాదయాత్రలో రైసుమిల్లు కార్మికులు, ఇటుకబట్టీ కూలీలు, వికలాంగులు, మహిళలు, వృద్ధులు షర్మిల వద్ద తమ కష్టాలను ఏకరవు పెట్టారు. కొంతమంది కన్నీటి పర్యంతమైతే,

మరికొందరు వైఎస్ మరణానంతరం తమను పట్టించుకునే వారే లేరంటూ బావురుమన్నారు. ‘జగనన్న ఎప్పుడొస్తాడు..రాజన్న రాజ్యం ఎప్పుడొస్తుందని’ ఆత్రంగా అడిగారు. ‘మీ కుటుంబానికి ఎన్ని కష్టాలొచ్చాయమ్మా’ అంటూ షర్మిలను పట్టుకొని కరిగి నీరయ్యారు.అర్తమూరులో ఆత్మీయ స్వాగతంఅర్తమూరులో షర్మిలకు వైఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ కర్రి పాపారాయుడు ఆధ్వర్యంలో పార్టీ జెండా రంగుల అంచులతో ఉన్న చీరలతో మూడువందలమంది మహిళలు, జగన్, షర్మిల చిత్రాలతో కూడిన టి షర్ట్‌తో ఐదువందల మందికి పైగా యువకులు వినూత్న రీతిలో స్వాగతం పలికారు. వైఎస్సార్, జగన్, విజయమ్మ, షర్మిల మాస్క్‌లతో చిన్నారులు సందడి చేశారు. షర్మిలపై పూలవర్షం కురిపిస్తూ పూల బాటపై నడిపించారు.

జగన్ సీఎం కావాలని పాస్టర్స్ ప్రార్థనలు
మండపేటలో షర్మిల కొత్తగా నిర్మించిన ఏసుక్రీస్తు మహిమమందిరంలో జరిగిన తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశానికి షర్మిల విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఫెలోషిప్ ప్రెసిడెంట్ ప్రతాప్‌సిన్హా, ప్రధాన కార్యదర్శి డానియల్‌పాల్, శుభకర్, జాన్సన్‌ల ఆధ్వర్యంలో ఆమెకు ఘనస్వాగతం లభించింది. పాస్టర్స్ షర్మిల పాదయాత్ర విజయవంతం కావాలని, వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలని, జగన్ సీఎం కావాలని ప్రార్థనలు చేశారు. వైఎ్‌స్ అధికారంలోకి రాగానే దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించడంతో పాటు క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, జెరూసలేం వెళ్లేందుకు ప్రత్యేక ఆర్థిక సాయం చేసే వారని సిన్హా గుర్తు చేశారు.

జనసరోవరమైన కలువపువ్వు సెంటర్
మండపేటలో ప్రజలు షర్మిల పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. వంతెన నుంచి బస చేసే కేపీ రోడ్ వర కు పూలపైనే నడిపించారు. మెయిన్‌రోడ్డు, బస్టాండ్ సెంటర్‌ల మీదుగా పాదయాత్ర కలువపువ్వు సెంటర్ వరకు సాగింది. అక్కడ జరిగిన బహిరంగ సభలో షర్మి ల ప్రసంగానికి అనూహ్య స్పందన లభించింది. సెంటర్ నలువైపులా రహదారులన్నీ నేల ఈనిందా అన్నట్టు జనంతో కిక్కిసిరిపోయాయి. ‘వైఎస్సార్ సువర్ణ యు గం కోసం..’ అంటూ షర్మిల ఆయన ప్రవేశపెట్టిన సంక్షే మ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రసంగంలో ప్రస్తావించారు. కాంగ్రెస్, టీడీపీలపై విమర్శనాస్త్రాలను సం ధించారు. వైఎస్, జగన్‌ల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ జనం ‘జై జగన్’ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. పొట్టిశ్రీరాములు రోడ్, రథం సెంటర్‌ల మీదుగా కేపీ రోడ్లో ఏర్పాటు చేసిన బసకు రాత్రి 8.30 గంటలకు చేరుకోవడంతో ఆరవ రోజు పాదయాత్ర ముగిసింది.

పొలాల్లో విరబూసిన కల్మషం లేని నవ్వులు
పొలమూరుపాకల శివారు పొలంలో బస చేసిన ప్రాంతం నుంచి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభమైన ఆరవరోజు పాదయాత్ర పొలమూరు, రామవరం క్రాస్ రోడ్, అర్తమూరు, తాపేశ్వరం క్రాస్ రోడ్, మండపేట పట్టణాల మీదుగా సాగింది. అడుగడుగునా మహిళలు షర్మిలకు హారతులు పట్టి, కొబ్బరికాయలు కొట్టి దిష్టి తీశారు. పచ్చని పొలాలు, పంటకాలువల మధ్య సాగిన పాదయాత్రకు జనం నీరాజనం పట్టారు.

పల్లెల జనం రాజన్న బిడ్డను చూసేందుకు పొలాల గట్లంట పరుగులు తీస్తూ వచ్చారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, వ్యవసాయ కార్మికులు షర్మిలను చూసేందుకు తహతహలాడారు. ఆమె తమవైపు తిరిగి చేతులూపగానే పట్టలేని ఆనందం ఉప్పొంగిపోయారు. ‘జై జగన్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పొలమూరు-అర్తమూరుల మధ్య, ఆ తర్వాత మండపేట వరకు రహదారికి ఇరువైపులా ఉన్న పచ్చని పంటపొలాల్లో యాత్ర సాగుతున్నప్పుడు షర్మిలను చూసిన కష్టజీవుల మోముల్లో కల్మషం లేని చిరునవ్వులు విరబూశాయి.

No comments:

Post a Comment