Saturday, 8 June 2013

ఉప ఎన్నికలు నిర్వహించాలని భూమన సవాల్ విసిరారు

తిరుపతి: రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు పరాకాష్టకు చేరాయని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. టీడీపీతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే ఎమ్మెల్యేలపై వేటు వేశారని ఆయన ఆరోపించారు. ఉప ఎన్నికలు జరగవనే కాంగ్రెస్‌, టీడీపీలు ధీమా ఉన్నాయన్నారు.

రెండు నెలల క్రితం సస్పెండ్ చేసి వుంటే ఎన్నికలు జరిగేవని, అప్పడు కాంగ్రెస్‌-టీడీపీలకు డిపాజిట్లు గల్లంతయ్యేవని చెప్పారు. పథకం ప్రకారమే అసెంబ్లీ సమావేశాలకు రెండు రోజుల ముందు సస్పెండ్ చేశారని ఆరోపించారు. ధైర్యముంటే ఉప ఎన్నికలు నిర్వహించాలని భూమన సవాల్ విసిరారు.

No comments:

Post a Comment