Saturday, 8 June 2013

Once in a Blue Moon.The Mla's Resign Accepted

హైదరాబాద్: విప్ ధిక్కరించిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఎమ్మెల్యేలు 15 మందిని శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ అనర్హులుగా ప్రకటించారు. వారిలో 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాగా, ఆరుగురు టిడిపి ఎమ్మెల్యేలు. విప్ ధిక్కరించామని, తమను అనర్హులుగా ప్రకటించమని మార్చిలోనే ఈ15 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. అయినా రెండున్నర నెలల పాటు విచారణ సాగింది. ఉప ఎన్నికలు రాకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్, టీడీపీలు కలిసి విచారణ ప్రక్రియను సాగదీశారని భావిస్తున్నారు. 

అనర్హులుగా ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు:
బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి - దర్శి
మద్దాల రాజేష్ - చింతలపూడి
ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి -కాకినాడ
గొట్టిపాటి రవి- అద్దంకి
సుజయ కృష్ణ రంగారావు - బొబ్బిలి
పేర్ని నాని - మచిలీపట్నం
ఆళ్ల నాని - ఏలూరు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - పుంగనూరు
జోగి రమేష్ - పెడన

అనర్హులుగా ప్రకటించిన టిడిపి ఎమ్మెల్యేలు:
ప్రవీణ్ కుమార్ రెడ్డి - తంబళ్లపల్లి
కొడాలి నాని - గుడివాడ
తానేటి వనిత - గోపాలపురం
అమర్ నాథ్ రెడ్డి - పలమనేరు
వై.బాలనాగిరెడ్డి - మంత్రాలయం
సాయిరాజ్ - ఇచ్చాపురం

మరో ముగ్గురు ఎమ్మెల్యేలు వేణుగోపాలచారి, రామకోటయ్య, హరీశ్వరరెడ్డిలపై విచారణను వాయిదా వేశారు. గంగుల కమలాకర్ అనర్హత పిటిషన్ శాసనసభాపతి వద్ద పెండింగ్ లో ఉంది. - See more at: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=614513&Categoryid=14&subcatid=0#sthash.LAiAVm33.dpuf

No comments:

Post a Comment