చిత్తూరు: సీఎం కిరణ్ పై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం చిత్తూరులో నిప్పులు చెరిగారు. సీఎం కిరణ్ దద్దమ్మ అని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యేల పదవులకు తాము ఎప్పుడో రాజీనామా చేశామని అయితే ఇంత కాలం మౌనంగా ఉండి ఇప్పుడు తమపై వేటు వేయడం ఏమిటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందనే ఇంతకాలం తమపై వేటు వేయడానికి జాప్యం చేశారని పెద్దిరెడ్డి ఆరోపించారు.
ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు గల్లంతు అవుతాయని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వానికి దమ్మ, ధైర్యం ఉంటే తక్షణమే ఉప ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాసం పెడితే ప్రభుత్వం కుప్పకూలుతుందనే ఇప్పుడు తమపై వేటు వేశారని పెద్దిరెడ్డి అభిప్రాయపడ్డారు.
- See more at: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=614519&Categoryid=14&subcatid=0#sthash.USbSOuSw.dpufఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు గల్లంతు అవుతాయని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వానికి దమ్మ, ధైర్యం ఉంటే తక్షణమే ఉప ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాసం పెడితే ప్రభుత్వం కుప్పకూలుతుందనే ఇప్పుడు తమపై వేటు వేశారని పెద్దిరెడ్డి అభిప్రాయపడ్డారు.
No comments:
Post a Comment