Wednesday, 12 June 2013

ప్రజాదరణ ఉండడం తప్పా?

6/13/2013 1:57:00 AM
‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నంత కాలం ఎవరికైనా అన్యాయం చేశారా? లేదే.. కానీ ఆయన చనిపోయిన తర్వాత వైఎస్ కుటుంబానికి ఎంత అన్యాయం జరుగుతోంది. వీళ్లెందుకింత దిగజారి ప్రవర్తిస్తున్నారు? జగన్‌ను అక్రమంగా జైల్లో పెట్టి ఆనందపడిపోతున్నారు? జగన్ ఎప్పటికైనా బయటకు వస్తాడు.. ఆయనకున్న జనాభిమానం ముందు ఎవరూ నిలవలేరు. మాకు న్యాయస్థానాలపై నమ్మకం ఉంది.

కానీ కాంగ్రెస్, టీడీపీ, ఎల్లోమీడియా, సీబీఐ కలిసి కుట్రలు, కుతంత్రాలు పన్ని న్యాయస్థానాలను సైతం తప్పుదోవపట్టిస్తున్నాయి. వైఎస్ కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని అందరూ గమనిస్తున్నారు. 2014 ఎన్నికల్లో జగన్ ప్రభంజనం ముందు అన్ని పార్టీలూ కొట్టుకుపోతాయి’’ అంటూ ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బుధవారం ధర్మవరంలో నిర్వహించిన ‘సాక్షి చైతన్య పథం’ సదస్సుకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై వైఎస్ కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రతిపక్ష పార్టీ కుమ్మక్కు రాజకీయాలను ఎండగట్టారు. జగన్‌ను అరెస్ట్ చేయడం ముమ్మాటికీ కుట్రలో భాగమేనని స్పష్టం చేశారు.
- న్యూస్‌లైన్, ధర్మవరం రూరల్/ తాడిమర్రి

అరచేత్తో సూర్యుణ్ని ఆపలేరు
అరచేయి అడ్డుపెట్టి సూర్యుణ్ని ఆపలేరు. వైఎస్ జగన్‌ను రాజకీయంగా అణగదొక్కాలని కాంగ్రెస్, టీడీపీ, ఎల్లో మీడియా కుమ్మక్కై పన్నుతున్న కుట్రలు ఫలించవు. జగన్ ఇమేజ్‌ను దెబ్బతీయాలని చూస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పే రోజులు ఆసన్నమయ్యాయి.
- నాగరాజు, ధర్మవరం


జనం గుండెల్లో జగన్
జగన్‌ను జైల్లో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనందపడుతోంది. జనం గుండెల్లో జగన్ ఉన్నారని వారు గుర్తించలేకపోతున్నారు. ఎన్నికల వరకు ఆయన్ను జైల్లోనే ఉంచి లబ్ధిపొందాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. ఇప్పుడు ప్రజలు చైతన్యవంతులయ్యారు. ఎన్ని కుతంత్రాలు పన్నినా జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసి ప్రజలే బయటకు తీసుకొస్తారు. ఇందుకోసం ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారు.
- రాజశేఖరరెడ్డి

రాజకీయంగా ఎదుర్కోలేకే కేసులు
నిరంతరం ప్రజల కోసం పాటుపడుతున్న వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ సీబీఐతో కలిసి వేధిస్తోంది. ప్రజాదరణ కలిగిన ఆ కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కొనలేక అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తోంది. వారి కుట్రలు, కుతంత్రాలు ఎన్నో రోజులు సాగవు. కాంగ్రెస్, టీడీపీ పతనమయ్యే రోజులు దగ్గర పడ్డాయి.
- విజయ, ధర్మవరం

కడిగిన ముత్యంలా బయటకొస్తారు
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై బనాయించిన అక్రమ కేసుల నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో జగన్ ఏనాడూ సచివాలయం వెళ్లింది లేదు. ఏ మంత్రికీ ఫోన్‌చేసి పనులు చేసి పెట్టాలని కోరిందీ లేదు. అలాంటిది ఆయన నేరం ఎలా చేస్తారు? నిజం నిప్పు లాంటిది. నిలకడ మీద తెలుస్తుంది.
- ముత్యాలు, ధర్మవరం
ఇవి కుట్ర రాజకీయాలు

ప్రజా క్షేత్రంలో గెలవలేని పార్టీలు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిన టీడీపీ ప్రతిపక్ష బాధ్యతను విస్మరించి జగన్‌ను దెబ్బ తీయాలని చూస్తోంది. కాంగ్రెస్, టీడీపీ కుమ్మ క్కు రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారు.
- బెస్త శ్రీనివాసులు, ధర్మవరం


పేదల కోసం పాటు పడిన కుటుంబంపై నిందలా?
మహానేత కుటుంబంపై నిందలు వేయడం కాంగ్రెస్ నేతల నీచ రాజకీయానికి నిదర్శనం. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఏం ద్రోహం చేశారు? రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన పార్టీని ఆయన పాదయాత్రతో రెండు సార్లు అధికారంలోకి తెచ్చి జీవం పోశారు. అలాంటి నేతను కొనియాడక పోగా ఆయన తనయుడు జగన్‌పై అక్రమ కేసులు బనాయించడం అన్యాయం. ప్రజలంతా గమనిస్తున్నారు. కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారు.
- సాలమ్మ, ధర్మవరం

ఆ తల్లి ఆవేదన పట్టదా?
భర్తను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న విజయమ్మ ఆవేదన మీకు కనిపించడం లేదా? రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. చాలా మంది జీవితాల్లో వెలుగునింపారు. అయితే... కాంగ్రెస్ గవర్నమెంటు వైఎస్ కుటుంబంలో విషాదాన్ని నింపుతోంది. జగన్‌ను జైల్లో పెట్టి వేధిస్తోంది. ఇది సహించరాని చర్య.
- వెంకటరమణమ్మ,
గృహిణి, ధర్మవరం


కక్షతోనే కేసులు
జగన్‌కు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజాదరణ ఉండడంతో ప్రభుత్వం కక్షతో కేసులు బనాయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐని కీలుబొమ్మగా చేసుకుని ఆడిస్తున్నాయి. జగన్‌కు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నాయి. ఇలాంటి చర్యల వల్ల న్యాయవ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది.
- సాదిక్‌బాషా, వ్యాపారి, ధర్మవరం


కాంగ్రెస్‌ను వీడినందుకే...
జగన్ కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీ పెట్టుకోవడంతో కక్ష గట్టి అక్రమ కేసు లు బనాయించారు. జగన్ విషయంలో సీబీఐ పొంతన లేని సాకులు చూపు తూ ఇబ్బందులకు గురిచేస్తోంది. వైఎస్ హయాంలో జారీ అయిన 26 జీవోలకు బాధ్యులైన మంత్రులను నిర్దోషులనడం, వాటితో సంబంధం లేని జగన్‌ను దోషిని చేయడం అన్యా యం. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారు.
- మహేష్, విద్యార్థి సంఘం నాయకుడు, ధర్మవరం


ఇది శానా అన్యాలం
మహానేత వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ వల్ల నా పిల్లలను చదివించాను. నా కూతురు ఇంజనీరింగ్ చదివి మంచి ఉద్యోగం సాధించింది. మా అమ్మాయి అండతోనే కుటుంబం గడుస్తోంది. ఇదంతా మహానేత చలవే. అలాంటి మంచి మనిషి కుటుంబాన్ని వేధిస్తుండడం బాధగా ఉంది. ఇది శాలా అన్యాలం.
- నిర్మలమ్మ, ధర్మవరం

రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు
జగన్‌పై ఇంత పెద్దఎత్తున కుట్రలు పన్నుతుండడం చూస్తుంటే రాజ్యాంగం కల్పించిన హక్కులను పాలకులు ఎలా అవహేళన చేస్తున్నారో అర్థమవుతోంది. తీవ్ర నేరాలు చేసిన వాళ్లకే మూడు నెలలకు బెయిల్ వస్తోంది. కేవలం అభియోగాలు ఎదుర్కొంటున్న జగన్‌కు ఎందుకు బెయిల్ రావడం లేదో అర్థం కావడం లేదు.
- పవన్‌కుమార్, ఎంఆర్‌పీఎస్ నేత

బండారం బయటపడుతుందనే ఇదంతా
జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి అందరికీ ముచ్చెమటలు పట్టాయి. జగన్ సీఎం అయితే చంద్రబాబు, ఆయన బినామీలైన ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, సినీనటుడు మురళీమోహన్ బండారం బయటపడుతుందనే ఇదంతా చేస్తున్నారు. ఎల్లో మీడియా ఇంత స్థాయికి దిగజారుతుందని అనుకోలేదు. జగన్‌ను తీవ్ర ఇబ్బందులు పెట్టడానికి చంద్రబాబు చేయాల్సిన కుయుక్తులన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. తగిన సమయంలో బుద్ధి చెబుతారు.
- మధు, బీటెక్ విద్యార్థి

‘ఓదార్పు’ వ్యక్తిగతమన్నా వినలేదు
తండ్రి మరణం తరువాత నల్లకాలువలో ఓదార్పుయాత్రను జగన్ ప్రకటించారు. అప్పటి నుంచి ఓదార్పు వ్యక్తిగతమని కాంగ్రెస్ అధిష్టానానికి చెబుతూ వచ్చారు. అయినా వినకుండా వేధించారు. జగన్‌కు వస్తున్న ఆదరణ చూడలేకే ఇంత నీచానికి దిగజారారు. వైఎస్ జగన్‌ను జైల్లో పెట్టి, ఆ పార్టీ కార్యకర్తలను కూడా బయటకు రాకుండా చేస్తున్నారు.
- గిర్రాజు రవి, చేనేత సంఘం నేత

జగన్ కోసం వేయికళ్లతో చూస్తున్నాం

జగన్‌ను జైల్లో పెట్టినప్పటి నుంచి టీవీల్లో వార్తలు చూడడం అలవాటు చేసుకున్నాం. జగన్ ఎప్పుడు బయటకు వస్తారా అనుకుంటూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నాం. భర్తను పోగొట్టుకున్న విజయమ్మకు కొడుకును కూడా దూరం చేయాలని చూస్తున్నారు. ఈ కుట్రలన్నీ చూస్తూనే ఉన్నాం. ఇక ఎంతో కాలం సాగనీయం. రాబోయే రోజుల్లో జగన్‌కు అంతా మంచే జరుగుతుంది.
- అనసూయమ్మ, గృహిణి


కాంగ్రెస్, టీడీపీలకు లక్ష్మినారాయణ తొత్తు
దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ స్వతంత్రంగా ఉండాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారింది. ఇక సీబీఐ జేడీగా ఉన్న లక్ష్మినారాయణ కాంగ్రెస్, టీడీపీ, ఎల్లోమీడియాకు తొత్తుగా వ్యవహరించారు. జగన్‌ను ఇబ్బందిపెట్టడమే ధ్యేయంగా పనిచేశారు. ఆయన రిలీవ్ అవుతూ చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనం.
- శంకర్‌రెడ్డి, లాయర్

చట్టాలను ఉపయోగించుకుని బెదిరిస్తున్నారు
వ్యక్తిగత, భావస్వేచ్ఛను హరింపజేస్తూ జగన్‌పై పొంతనలేని అభియోగాలను సీబీఐ నమోదు చేస్తోంది. 436, 437, 438 సెక్షన్లతో పాటు జగన్‌కు అసలు సంబంధమే లేని 409 సెక్షన్‌ను కూడా ఉపయోగించడం వెనుక ఎన్ని కుట్రలు ఉన్నాయో అర్థమవుతోంది. పెద్ద పెద్ద నేరాల్లో కూడా కోర్టు 90 రోజుల్లో బెయిల్ ఇస్తుంది. జగన్ విషయంలో సీబీఐ... కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తోంది. ఛార్జిషీట్లను ముక్కలు ముక్కలుగా చేసి వేస్తోంది. విచారణకు ఇంకా గడువు కావాలని కోరడం జగన్‌ను వేధింపులకు గురిచేయడం కోసమే.
- అతావుల్లా, లాయర్


ప్రజాదరణ ఉండడం తప్పా?
రాష్ట్రంలో కోట్లాది కుటుంబాలకు మహానేత వైఎస్ సహాయం చేశారు. తన హయాంలో ఎన్నడూ పన్నులు పెంచలేదు. గ్యాస్ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చూశారు. ఇంకా ఎన్నో మంచి పనులు చేశారు. జగన్‌కు ప్రజాదరణ ఉండడం నేరమా? ఇంతగా దిగజారి రాజకీయాలు చేస్తారా?
- చంద్రశేఖరరెడ్డి, తిప్పేపల్లి

కేంద్రం చేతిలో సీబీఐ కీలుబొమ్మ
కేంద్రం చేతిలో సీబీఐ కీలుబొమ్మ. ఒక ఉన్నత దర్యాప్తు సంస్థలా కాకుండా కేంద్ర ప్రభుత్వ పెద్దల చేతిలో ఆట బొమ్మగా మారింది. జగన్ విషయంలో సీబీఐ వ్యవహరిస్తున్న తీరు దర్యాప్తు సంస్థలపై ప్రజలకు విశ్వాసం లేకుండా చేస్తోంది. నిష్పక్షపాతంగా సాగాల్సిన దర్యాప్తు ఇలా ఓ వర్గం చెప్పు చేతుల్లో నడవడం ప్రజాస్వామ్య విలువలను కాలరాసినట్లే. ఇప్పటికైనా దర్యాప్తును పారదర్శకంగా నిర్వహించి... జగన్‌కు బెయిల్ మంజూరు చేయాలి. - శివారెడ్డి, ధర్మవరం 

No comments:

Post a Comment