Monday, 10 June 2013

నిజాయితీగా రాజకీయాలు చేసే ధైర్యం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు ఎప్పుడూలేదని వైఎస్ఆర్ సిపి నాయకురాలు షర్మిల విమర్శించారు

మండపేట: నిజాయితీగా రాజకీయాలు చేసే ధైర్యం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు ఎప్పుడూలేదని వైఎస్ఆర్ సిపి నాయకురాలు షర్మిల విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోదని తెలిస్తే చంద్రబాబు అవిశ్వాసం పెడతారని, ప్రభుత్వం కూలిపోతుందని తెలిస్తే విశ్వాసం ప్రకటిస్తారన్నారు. ఏ పార్టీ అవిశ్వాసం పెట్టినా వైఎస్ఆర్ సిపి మద్దతు పలుకుతుందని షర్మిల చెప్పారు.

తమ పదవులు పోతాయని తెలిసినా ఎమ్మెల్యేలు అవిశ్వాసానికి మద్దతు పలికారన్నారు. మార్చిలో ఓటేస్తే, అప్పుడు వారిపై స్పీకర్ అనర్హత వేటువేయలేదని చెప్పారు. అప్పుడు వేటు వేస్తే ఉప ఎన్నికలు వచ్చి ఉండేవని, ఉప ఎన్నికలు వస్తే తమ పార్టీ అన్ని సీట్లూ గెలుచుకునేదన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు కూడా వచ్చి ఉండేవికావన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు స్పీకర్ వంతపాడారని ఆమె విమర్శించారు.
- See more at: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=615765&Categoryid=14&subcatid=0#sthash.7FMZTmzT.dpuf

No comments:

Post a Comment