6/13/2013 1:25:00 AM
- మాటపై నిలబడినందుకే జగన్‌కు ఇన్ని కష్టాలు
- చంద్రబాబు బినామీ ఆస్తులపై సీబీఐ దర్యాప్తు చేయదా? - ‘సాక్షి’ చైతన్య పథంలో వక్తలు అందుకు సీబీఐ, ఎల్లో మీడియా సహకరిస్తుండటం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. మరో న్యాయవాది శంకర్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌ను అరెస్ట్ చేసే సమయంలో సీబీఐ మోసపూరితంగా వ్యవహరించిందన్నారు. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ రిలీవ్ అవుతూ ఇన్ని రోజులు తనకు మీడి యా సహకరించిందంటూ కృతజ్ఞతలు చెప్పడాన్ని బట్టి చూస్తే ఎల్లో మీడియా ఆయనకు ఎంతగా సహకరించిందో అర్థమవుతోందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటపై నిలబడినందుకే జగన్ ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారన్నారు. చేనేత సంఘం నాయకుడు గిర్రాజు రవి మాట్లాడుతూ చంద్రబాబు, కాంగ్రెస్ నాయకులు కుట్రపన్ని వైఎస్ కుటుంబానికి ఇబ్బందులు కలిగిస్తున్నారన్నారు. జగన్‌కు ఉన్న ప్రజాబలం ముందు నిలువలేక, ఆయన్ను జైల్లో వేయించారని దుయ్యబట్టారు. వైఎస్ మరణానంతరం ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలకు రూ.వందల కోట్ల నిధులు విడుదల చేస్తున్నారనీ, ఇదే నిజమైన క్విడ్ ప్రొ కో అన్నారు. జననేత జగన్‌ను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని గృహిణి అనసూయమ్మ ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. ప్రజలకు సేవ చేయాలని పరితపించే కు టుంబం వైఎస్‌ఆర్‌ది అని, ప్రజలను నాశనం చేయాలనుకునే కుటుంబం సోనియాదని బీటెక్ విద్యార్థి మధు అన్నారు. రెండెకరాల ఆస్తితో రాజకీయాల్లోకి వచ్చి న చంద్రబాబు బినామీ పేర్లతో రూ.వేల కోట్లు విలువ చేసే భూములను సంపాదించారని, అవి సీబీఐకి కనపడవా అని ఎమ్మార్పీఎస్ నాయకుడు పవన్‌కుమార్ మాదిగ ప్రశ్నించారు. స్వప్న వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో పలువురు మేధావులు, సామాజిక కార్యకర్తలు, విద్యావంతులు, ప్రజలు పాల్గొన్నారు. |
No comments:
Post a Comment