6/13/2013 1:29:00 AM
* జగనన్న సీఎం అవుతాడు.. ప్రజా సమస్యలు తీరుస్తాడు
* మరో ప్రజాప్రస్థానంలో షర్మిల ఉద్ఘాటన * రాజన్న రాజ్యంలో వైఎస్ పథకాలన్నీ అమలవుతాయి * చేనేత కార్మికులకు మంచి రోజులు వస్తాయి * వికలాంగులకు మేలు జరుగుతుంది ప్రజాసమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన చంద్రబాబు కుతంత్రానికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర బుధవారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని గ్రామాల మీదుగా సాగింది. పెదపూడి గౌరవమ్మవీధి చేనేత కాలనీలో వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన చేనేత కార్మికులు తమ కష్టాలను షర్మిలకు వివరించారు. ‘‘చంద్రబాబు హయాంలో కుదేలైన చేనేత రంగాన్ని వైఎస్ అన్ని విధాలా ఆదుకున్నారు. ఆయన హయాంలో చేనేత సంఘాలు, కార్మికులకు భరోసా ఉండేది. నష్టాల్లో ఉన్న సంఘాలన్నీ వైఎస్ పాలనలో లాభాల బాట పట్టాయి. ఆయన మరణం తర్వాత మాకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. 2009 బడ్జెట్‌లో చేనేత రంగానికి వైఎస్ కేటాయించిన రుణమాఫీ నిధులు ఇప్పటికి కూడా పూర్తిగా విడుదల చేయలేదు..’’ అని గోడు వెళ్లబోసుకున్నారు. చంద్రబాబు హయాంలో రాజమండ్రి, గుంతకల్లు, చీరాల స్పిన్నింగ్ మిల్లులు, నెల్లూరు జరీ మిల్లు మూతపడ్డాయని చెప్పారు. 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులకు వైఎస్ వృద్ధాప్య పింఛన్లను వర్తింపచేశారని, కానీ ఇప్పుడు దాన్ని నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి బాధలు విన్న షర్మిల.. జగనన్న సీఎం అయ్యాక చేనేత కార్మికులను ఆదుకుంటాడని హామీనిచ్చారు. ఈ సందర్భంగా చేనేత నాయకులు షర్మిలకు చరఖాను బహూకరించారు. అందరికీ ధైర్యం చెబుతూ.. ప్రజల కష్టాలను తెలుసుకుంటూ, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ షర్మిల ముందుకు సాగారు. ‘‘నెలనెలా పింఛన్లు సక్రమంగా రావడం లేదు. ఏదో ఒక సాకుతో ఆలస్యం చేస్తున్నారు’’ అని కప్పు వీరబ్రహ్మారెడ్డి అనే వృద్ధుడు షర్మిలకు మొరపెట్టుకోగా.. ‘‘త్వరలో రాజన్న రాజ్యం వస్తుంది. తప్పకుండా పింఛను అందుతుంది’’ అని భరోసానిచ్చారు. జి.మామిడాడ ఎల్‌ఎన్‌పురంలో వరలక్ష్మి అనే మహిళ షర్మిలతో మాట్లాడుతూ.. ‘‘మా బతుకులు మళ్లీ బాగుండాలంటే జగనన్న బయటకు రావాలి’’ అని అన్నారు. జి.మామిడాడలోనే వికలాంగుడైన శ్రీనును షర్మిల ఆత్మీయంగా పలకరించారు. ‘‘మీలాంటివారు ఎవ్వరిపైనా ఆధారపడకుండా బతికేందుకు జగనన్న మేలు చేస్తాడు. చిన్నచిన్న వ్యాపారాలు నడుపుకొనేందుకు రుణాలు మంజూరు చేస్తాడు.’’ అని చెప్పారు. 15.5 కిలోమీటర్లమేర నడక.. |
No comments:
Post a Comment