టీడీపీ అస్త్రంలా కాంగ్రెస్ పనిచేస్తోంది
6/4/2013 1:55:00 AM
రాజ్యాంగ విలువలను కాలరాస్తోంది
‘సాక్షి’ చైతన్య పథంలో వక్తలు కావలి, న్యూస్‌లైన్: ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో సీబీఐ అత్యుత్సాహం, కుట్రలకు పాల్పడుతోంది. రాజ్యాం గ నిబంధనలకు లోబడి పని చేయాల్సిన సంస్థ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ అస్త్రంలా పనిచేస్తూ.. రాజ్యాంగ విలువలను కాలరాస్తోంది’.. అంటూ పలువురు మేధావులు, ప్రజలు, విద్యార్థులు దుయ్యబట్టారు. నేరం రుజువు కాకుండానే దుష్ట పన్నాగాలతో ఏడాది కాలంగా జగన్‌ను జైలులో నిర్బంధిం చడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలోని రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి కల్యాణ మంటపంలో సోమవారం ‘సాక్షి చైతన్య పథం’ చర్చావేదిక నిర్వహించారు. న్యాయవాదులు, విద్యావేత్తలు, విశ్రాంత ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు చైతన్యపథంలో పాల్గొని సీబీఐ వైఖరిని ఖండించారు. ఉద్దేశపూరక్వకంగా జగన్‌కు బెయిల్ రాకుండా చార్జిషీట్‌ల పేరుతో దర్యాప్తును సాగదీస్తూ సీబీఐ కుతంత్రాలను కొనసాగిస్తోందన్నారు. |
No comments:
Post a Comment