జగన్ ఒక్కరే నమ్మదగిన నేత: జూపూడి
చెన్నై: మహానేత వైఎస్‌ఆర్‌ను తిడితే మంత్రి పదవులు ఇచ్చారని, కిరణ్‌ను తిడితే మంత్రి పదవి నుంచి తొలగించారు.. ఇదీ కాంగ్రెస్ సంస్కృతి అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ అన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు నమ్మదగిన నేత వైఎస్ జగన్ ఒక్కరే అని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, కిరణ్‌లకు ఓటమి తప్పదన్నారు. లగడపాటి నుంచి చాణక్య సర్వేలన్నీ 2014లో వైఎస్ జగన్‌దే విజయమని చెప్పాయని వెల్లడించారు. రాష్ట్రంలో నమ్మడానికి వీల్లేని వ్యక్తి ఎవరంటే చంద్రబాబే అన్నారు. ఏపీలోని మహిళా సమాజం మొత్తం జగన్ వెంటే ఉందన్నారు. ఎవరెన్ని నాటకాలు ఆడినా దళితులెవరూ కాంగ్రెస్, టీడీపీలను నమ్మరన్నారు. |
No comments:
Post a Comment