లక్నో: బీజేపీ నేత వరుణ్‌గాంధీని మూడేళ్లనాటి విద్వేషపూరిత ప్రసంగం కేసు వెంటాడుతూనే ఉంది. ఈ కేసుకు సంబంధించి ఆయనను నిర్దోషిగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ బుధవారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు జూన్10న విచారణకు రానున్నట్టు అధికారులు తెలిపారు. ముస్లిం వర్గాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో అధికార సమాజ్‌వాదీ పార్టీ వరుణ్‌కు వ్యతిరేకంగా ఈ పిటిషన్ దాఖలు చేసింది. - See more at: http://www.sakshi.com/main/FullStory.aspx?CatId=608623&Categoryid=1&subCatId=32#sthash.XL6jTuys.dpuf
No comments:
Post a Comment