చంద్రబాబును నిలదీసిన వైఎస్సార్‌సీపీ నేత గట్టు
- జైల్లో ఉన్నవారు నీలిచిత్రాలు చూస్తున్నారనడం బాబు దివాలాకోరుతనం
- ఆ ఫ్యాక్టరీ ఏమైనా మీ ఇంట్లో పెట్టారా?
- మాకు కోర్టులపై గౌరవం ఉంది.. అందుకే న్యాయ పోరాటం చేస్తున్నాం
- సీబీఐని సుప్రీంకోర్టు ‘పంజరంలో చిలుక’ అన్నా.. బాబు మిన్నకున్నారేం?
- ఆయనపై ఉన్న కేసులను దర్యాప్తు చేస్తే ఎప్పుడో దుబాయ్‌కి చెక్కేసేవారు
సాక్షి, హైదరాబాద్: జై ళ్లలో ఉన్నవారు మద్యం సేవిస్తున్నారని, నీలి చిత్రాలు చూస్తున్నారని అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘నీలి చిత్రాలేమైనా చంద్రబాబు ఇంట్లో తయారు చేయించి పంపిస్తున్నారా? ఆ ఫ్యాక్టరీ ఏమైనా మీ ఇంట్లో పెట్టారా? నీలి చిత్రాల విషయంలో బాగా అనుభవమున్న మీ కొడుకు ఏమైనా పంపిస్తున్నారా..?’’ అని సూటిగా నిలదీశారు. చంద్రబాబు మదపిచ్చితో ప్రజాస్వామ్యాన్ని, మానవత్వాన్ని ఖూనీ చేసేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో గట్టు రామచంద్రరావు బుధవారం విలేకరులతో మాట్లాడారు. 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ, తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో కొనసాగిన ఎజెండానే టీడీపీ నిర్వహించిన మహానాడులో పునరావృతం అయిందని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలు ఏ ఒక్కటి కూడా చర్చించకుండా.. కేవలం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని దూషించడమే ఎజెండాగా మహానాడును నిర్వహించినట్లుందన్నారు. ఎన్టీఆర్ మరణానికి కారకుడైన చంద్రబాబే ఆయన ఫొటోకు పూలమాల వేయడం విడ్డూరంగా ఉందని.. బాబు నిర్వహించినది మహానాడు కాదని అదొక మహాపాడు అని ఎద్దేవా చేశారు.
- See more at: http://www.sakshi.com/main/FullStory.aspx?catid=608331&Categoryid=1&subcatid=33#sthash.FPGDlP7D.dpuf
- జైల్లో ఉన్నవారు నీలిచిత్రాలు చూస్తున్నారనడం బాబు దివాలాకోరుతనం
- ఆ ఫ్యాక్టరీ ఏమైనా మీ ఇంట్లో పెట్టారా?
- మాకు కోర్టులపై గౌరవం ఉంది.. అందుకే న్యాయ పోరాటం చేస్తున్నాం
- సీబీఐని సుప్రీంకోర్టు ‘పంజరంలో చిలుక’ అన్నా.. బాబు మిన్నకున్నారేం?
- ఆయనపై ఉన్న కేసులను దర్యాప్తు చేస్తే ఎప్పుడో దుబాయ్‌కి చెక్కేసేవారు
పార్టీ కేంద్ర కార్యాలయంలో గట్టు రామచంద్రరావు బుధవారం విలేకరులతో మాట్లాడారు. 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ, తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో కొనసాగిన ఎజెండానే టీడీపీ నిర్వహించిన మహానాడులో పునరావృతం అయిందని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలు ఏ ఒక్కటి కూడా చర్చించకుండా.. కేవలం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని దూషించడమే ఎజెండాగా మహానాడును నిర్వహించినట్లుందన్నారు. ఎన్టీఆర్ మరణానికి కారకుడైన చంద్రబాబే ఆయన ఫొటోకు పూలమాల వేయడం విడ్డూరంగా ఉందని.. బాబు నిర్వహించినది మహానాడు కాదని అదొక మహాపాడు అని ఎద్దేవా చేశారు.
- See more at: http://www.sakshi.com/main/FullStory.aspx?catid=608331&Categoryid=1&subcatid=33#sthash.FPGDlP7D.dpuf
No comments:
Post a Comment