Thursday, 13 June 2013

మూడు పోగులకు మూడువేదాలు, త్రిమూర్తులు, త్రిసంధ్యాకాలాల్లో జరిపే సంధ్యావందనాలు ఇవన్నీ symbolisms ఉన్నాయి.

జంధ్యం ఎందుకు ధరిస్తారు? అంటే దాని ప్రాముఖ్యత ఏమిటి అని నా ఉద్దేశ్యం. అది కూడా కొన్ని కులాలలో/వర్ణాలలో మాత్రమే ఎందుకు ధరిస్తారు? ఉపనయనం, జంధ్యధారణ మగవారికి మాత్రమే ఎందుకు పరిమితం?


యజ్ఞోపవీత ధారణ ఉపనయనమనే (వడుగు అనే) ఒక 

వైదికసంస్కారంలోని అంతర్భాగం తెలుగులో జంధ్యం 

అంటాం. బాల్యావస్థనుండి బ్రహ్మచర్యాశ్రమానికి 

మార్పుని సూచిస్తుంది. తల్లిదండ్రులను వదలి 

గురువుగృహానికి (గురుకులానికి) వెళ్ళడానికి 

సమాయత్తంచేయడమే. మొదటిఘట్టం అనేక 

ప్రాయశ్చిత్తకర్మలు. జాతకర్మ,నామకరణం,అన్నప్రాశన,.. 

మొదలైన వాటిలో జరగిన దోషాల సవరణ ఉద్దేశ్యం. 

వేదాధ్యనానికి, మంత్రోపదేశానికి, .. అధికారాన్ని 

ఇస్తుంది. తండ్రి బ్రహ్మోపదేశం, గురువు గాయత్రి 

ఉపదేశిస్తారు. హిందూధర్మం లో వర్ణాశ్రమ ధర్మాలే 

ఉన్నాయి. కులం అనే సంస్కృతపదానికి అర్థం కుటుంబం 

లేదా సమూహం. కులాలని చెప్పుకునేవి professional 

groups. అది సమాజంలో జరిగినది, మతానికి 

సంబంధంలేనిది. యజ్ఞోపవీతాన్నే 

బ్రహ్మసూత్రమనికూడా అంటారు. స్త్రీ కి వివాహంలో 

మంగళసూత్రం వంటిదే. మూడు పోగులకు 

మూడువేదాలు, త్రిమూర్తులు, త్రిసంధ్యాకాలాల్లో జరిపే 

సంధ్యావందనాలు ఇవన్నీ symbolisms ఉన్నాయి. ఈ 

ధారణ మూడూ వర్ణాలకే కాదు ఇతరులు కూడా 

ధరిస్తారు. దయానంద సరస్వతి అందరినీ ధరించమనే 

చెప్పారు. పూర్వకాలంలో స్త్రీలు కూడా ధరించేవారట. 

తరువాతా కాలంలో వివాహ సమయములో వరునికి 

అదనపు పోగు ఇచ్చి ఆయన కర్మలలో ఫలం భార్యకు 

కూడా ఇచ్చారు. 

No comments:

Post a Comment