Friday, 14 June 2013

ఆత్మబంధమే మోక్షానికి ప్రతిబంధo

ఆత్మబంధమే మోక్షానికి ప్రతిబంధo

రాజు ఎలాగైతే అన్నిటికీ విలక్షణంగా సాక్షిగా ఉంటున్నాడో, అలాగే ఆత్మకూడా ప్రకృతి వలన వచ్చిచన దేహమునకు, ఇంద్రియములకు, మనస్సుకు, బుద్ధికీ కూడా విలక్షణంగా సాక్షిగా ఉంది. అని తెలుసుకో అంటారు భగవత్పాదులు ఆదిశంకరాచార్యులవారు.
28FeafFఇక రైలు నడవాలంటే ఆవిరి శక్తి అవసరం, ఆ శక్తికి బండిలో వారి కష్టసుఖాలతో అవసరంలేదు. ఒక స్థలానికి, వెళ్ళాలన్న లక్ష్యంలేదు. ఆదే విధంగా ఆత్మ చైతన్యం దేహం అంతా వ్యాపించి జ్ఞానేంద్రియాలకు, మనస్సుకు, బుద్దికి అన్నింటికీ పనిచేసే శక్తిని ఇస్తుంది. అందువలన ఆత్మేపనిచేస్తోంది అని అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఆత్మ ఏమీ చేయదు. ఈ కర్మల వలన వచ్చే కష్టసుఖాలకు ఆత్మకు బాధ్యత లేదు. మనస్సు చేసే సంకల్ప, వికల్పాలకు చైతన్యం ఇచ్చేది ఈ ఆత్మే. ఇంకా ఈ ఆత్మ ప్రకాశంలోనే వాటిని తెలుసుకోగలుగుతున్నారు. 28Feafశ్రీ శంకరాచార్యులవారు ప్రతి శ్లోకంలోను ఒక ఉపమానంగా ఆత్మను సూచిస్తూవున్నారు. సూక్ష్మ స్వరూపముతో ప్రతిదానిలోను లోపల, బయట ఉన్న ఆత్మ స్థూల ఇంద్రియాలకు తెలియరాదు. కాబట్టి ఇన్ని ఉపమానాలతో దానిని నిరూపించడం. సాధారణంగా చంద్రుడు పరిగెడుతున్నాడు అని చెప్పేది, రైలు పరిగెడుతున్నప్పుడు చెట్టు, పుట్టలు వెనుకకు పరిగెడుతున్నట్లు కనిపిస్తాయి ఇందులో చూడబడే వస్తువుకు, చూస్తున్న వస్తువు యొక్క గుణం ఆపాదింపబడుతోంది. 
మనలో వచ్చే మంచి ఆలోచనలకు, జ్ఞానమునకు, అజ్ఞానమునకు, సుఖమునకు, దుఃఖమునకు ఒకరిని చూచి అభినందించుటకానీ, నిందించుట కానీ, స్థూలశరీరం చేసే పనులు. ఈ భావములను, ఆ భావములను తెలియజేసేది ఆత్మచైతన్యము. ఆ ఆత్మచైతన్యం అన్నింటికీ విలక్షణంగా ఉండి, కేవలం చూస్తూ ఉంటుంది. కానీ అనుభవాన్ని పంచుకోదు. రాజు ఎలాగైతే సాక్షిరూపంగా ఉంటాడో, అలాగే ఆత్మకూడా సాక్షిగా ఉంటుంది. 
28Feaఆత్మ స్థూలదేహము చేసే కర్మలకు, జ్ఞానేంద్రియములు చేసే కర్మలకు సాక్షి మాత్రమే. సాక్షి అంటే ఆ కర్మలో ఏమాత్రం భాగస్వామిని కాదు. దూరంగా ఉండి, చూసేది సాక్షి. ఆత్మకు కర్తుత్వం కాని, భోక్తృత్వం కాని లేదు. అలాగే మనస్సు చేసే సంకల్పవికల్పాలకు కానీ, బుద్ధి చేసే నిశ్చయానికి గానీ సాక్షి మాత్రమే. వాస్తవానికి దేహము, యింద్రియములు అన్నీ ప్రకృతి సంబంధమైనవి, జడస్వరూపమైనవి. ఇవి అన్నీ కూడా ఆత్మచైతన్యం వలన వాటి వాటి పనులు చేస్తూన్నాయి. అంటే ఆత్మవాటిని ప్రకాశింపచేస్తోంది. ప్రకాశాన్నిచ్చేది, ప్రకాశింపబడేది ఒక్కటి ఎప్పుడూ కాలేదు. దీపం కూడా ప్రకాశింపచేస్తుంది. కాని, కుండ దీపాన్ని ప్రకాశింపజేయలేదు. అదే విధంగా జడస్వరూపాలైన ఈ ఇంద్రియాలు ఆత్మను తెలిసికోలేవు. Adiరాజు దర్బారులో జరిగే నాట్యానికి గానీ, నాటకానికి గానీ, రాజు సాక్షిగా ఉంటాడు కానీ వానిలో భాగస్వామి కాడు. అదేవిధంగా ఆత్మదేహములో జరిగే పనులకు సాక్షిగా ఉంటుంది కానీ భాగస్వామి కాదు.మనలో వచ్చే మంచి ఆలోచనలకు, జ్ఞానమునకు, అజ్ఞానమునకు, సుఖమునకు, దుఃఖమునకు ఒకరిని చూచి అభినందించుటకానీ, నిందించుట కానీ, స్థూలశరీరం చేసే పనులు. ఈ భావములను, ఆ భావములను తెలియజేసేది ఆత్మచైతన్యము. ఆ ఆత్మచైతన్యం అన్నింటికీ విలక్షణంగా ఉండి, కేవలం చూస్తూ ఉంటుంది. కానీ అనుభవాన్ని పంచుకోదు. రాజు ఎలాగైతే సాక్షిరూపంగా ఉంటాడో, అలాగే ఆత్మకూడా సాక్షిగా ఉంటుంది. Adi-(1)ఈ శ్లోకంలో కర్తృత్వ, భోక్తృత్వాలు లేకుండా సాక్షిగా ఉండడం అలవాటు చేసుకోవాలి అని శంకర భగవత్పాదుల వారు సూచిస్తున్నారు. అంటే, మన విధిని మనం నిర్వర్తిస్తూ, నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనే అహంకార మమకారాలు వదిలెయ్యాలి. జీవన గమనంలో ఇది సాధ్యమేనా అనుకుంటే, చెయ్యాలన్న పట్టుదల ఉంటే సాధ్యపడుతుంది. అనైచ్ఛిక కర్మలు చేఐసేటప్పుడు ఎలాగైతే కర్తృత్వం లేకుండా జరిగిపోతాయో అలాగే అన్ని పనులు చెయ్యడం అలవరచుకోవాలి. ఇది మోక్షానికి ఒక మార్గం. 

అయితే, ఆత్మకు కర్తృత్వం, భోక్తృత్వం లేవా అంటే లేవు అని శంకరులవారు శెలవిచ్చారు. ఆత్మ ఆవరణ వల్ల స్వప్రకాశం కనిపించక, జ్ఞానరూపంలో ఉన్నప్పుడు అజ్ఞాని ఆత్మను తెలుసుకోలేక, ఆత్మకు కర్తృత్వ భోక్తృత్వాలు ఆపాదిస్తున్నాడు. ఇంద్రియాలు పనిచేస్తుంటే, ఆత్మే ఆ పనులన్నీ చేస్తోందని భ్రమపడుతున్నాడు. ఆత్మ చైతన్యం ఆయా ఇంద్రియాల్లో ప్రవేశించడం వలన అవి పనిచేస్తాయే కానీ, ఆత్మపని చెయ్యదు. 

అజ్ఞానంలో ఉన్నవాడు సత్యాసత్య వివేకం లేక ఆత్మను అనాత్మునిగాను, అనాత్మను ఆత్మగాను అనుకుంటాడు. అందుకనే జడస్వరూపాలైన ఇంద్రియాలు చేసే పనులను ఆత్మకు ఆపాదిస్తాడు. ఆత్మకు కర్తృత్వం లేదు. అది వాటికి సాక్షి మాత్రమే అని గ్రహించడు. 

ఆయన ఒక శ్లోకంలోని ఉపమానంలో భూమి మీద మానవుడు మహావుంటే ఆరు అడుగుల ఎత్తు ఉంటాడు, మేఘాలు 2-3 మైళ్ళ ఎత్తులో ఉంటాయి, చంద్రుడో కొన్నివేల మైళ్ళ ఎత్తున ఉన్నా, అవిగో మేఘాలు చంద్రుని కప్పుతాయి అని అనడం ‘చంద్రుడు పరిగెడుతున్నాడు’ అని అనడం అలవాటు. అదే విధంగా దేహంలో, మనస్సులో, ఇంద్రియాల్లో కనిపించే చలనం ఆశాంతి, అన్నీ ఆత్మకు ఆపాదింపబడుతున్నాయి. చంద్రునికి చలనం కల్పించడానికి కారణం కదులుతున్న మేఘాలు మాత్రమే. అదేవిధంగా అశాంతిగావున్న చలించుచున్న ఇంద్రియములతో ఆత్మను తాదాత్మ్యం చేయబడవు కనుక మొదట ఆత్మ ఇంద్రియాలకు వాటి వృత్తులకు కూడా ఆత్మ సాక్షి మాత్రమే. మనస్సులోని ఆత్మ చలించదు. కాకపోతే శాంతంగా ఉన్న మనస్సులో ఆత్మ ప్రతిఫలిస్తుంది. కానీ చలించే మనస్సులో ఆత్మబింబం కనిపించదు.

No comments:

Post a Comment