Friday, 14 June 2013

కాలజ్ఞానం పొల్లుబోదు

కాలజ్ఞానం పొల్లుబోదు

మీరు అజ్ఞానాంధకారంలో మునిగి నన్ను ఎరుగకున్నారు. అరిషడ్వర్గాలకు లోనై వున్న వారైనందున మీకు నా మహిమలు తెలియవు. నన్ను ఎరుగుట అందరికి సాధ్యం కాదు. అన్నారట ఒకానొక సందర్భంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారు. అనేక పదార్థాల్లో తిరిగే గరిటెకు వాటి రుచి తెలియనట్టే అన్నీ తెలుసు అనుకునే మానవునికి నిజానికి ఏమి తెలియదు. వెరుు్య మందిలో ఒకడు చిత్తశుద్ధి కలిగిన భక్తి భావంతో ఉంటాడు. వారిలో కూడ కొంత మంది మాత్రమే పరమాత్మ తత్వమెరిగి ముక్తి మార్గంలో పయనిస్తారు.

ఆనాడు సమాజంలో నెలకొని ఉన్న అంటరానితనం, బాల్య వివాహాలు, సతీసహగమనం వంటి అనేక సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు ఉదయించిన భగవంతుని స్వరూపమే శ్రీమద్విరాట్‌ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి. దృష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం భగవంతుడు అనేక అవతారాల్లో అవతరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో క్రిష్ణుడు పురాణాలు చెబుతుండగా కలియుగంలో జనులను జాగృతి పరిచేందుకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామిగా విష్ణుమూర్తి, దూదేకుల సిద్ధయ్యగా మహేశ్వరుడు, గోవింద మాంబగా శ్రీలక్ష్మి జన్మించారని కాలజ్ఞానం చెబుతోంది. హిందూ, మహమ్మదీయుల సఖ్యత, సర్వమానవ సమానత్వం, సహ పంక్తి విందులు పాటించడంతో పాటు కాలజ్ఞానాన్ని బోధించి శాంతి అభ్యుదయాలను నెలకొల్పి లోక కళ్యాణార్ధం తపస్సు చేసి సజీవ సమాధి పొందారు. ఆ మహానుభావుడు. 

జన్మరహస్యం
కర్ణాటక రాష్ట్రంలోని బ్రహ్మాండపురంలో క్రీస్తు శకం 1608న కాలజ్ఞానంలోని మరుగు వ్యాఖ్యల ఆధారంగా కార్తీక శుద్ధ ద్వాదశినాడు పరిపూర్ణాచార్యులు, ప్రకృతాంబలకు వీరప్ప శ్హయ్య జన్మించారు. ఆయన జన్మించగానే తండ్రిని కోల్పో య్యారు. తల్లి ప్రకృతాంబ తన కుమారుడ్ని సమీపంలో ఉన్న అత్రి మహామునికి అప్పజెప్పి ప్రాణాలు వది లింది. పాపాగ్ని పీఠానికి చెందిన యనమదల వీరభోజయ్యస్వామి ఆయన భార్య వీరపాపమాం బలకు సంతానం లేకపోవడంతో అత్రి మహాము నిని వేడుకోగా తన వద్ద వున్న బాలుడిని తీసుకొని పోయి పెంచుకోమని చెప్పాడట. వీరప్పయ్యకు 5వ ఏట విద్యాభ్యాసం జరిగింది. 14వ యేట వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ కర్నూలు జిల్లా, బనగానపల్లె(హరిహరపురం)కు చేరి తపస్సు చేయడం ప్రారంభించారు. బనగానపల్లెలో మోతూబరి అయినటువంటి గరిమిరెడ్డి అచ్చమ్మగారింట గోవుల కాపరిగా చేరాడు. అక్కడే ఆవులను కాస్తూ సమీపంలోనే రవల కొండలో వున్న గుహలో కూర్చొని తాటాకుల మీద భవిష్యత్తులో ఏమి జరుగుతుందో కాలజ్ఞానం గ్రంధంగా రాశారని తెలుస్తోంది.

భవిష్యత్తు చిత్రపటం
ఈ ప్రపంచంలో కలియుగంలో 5 వేల ఎళ్లు దాటిన తర్వాత జరగబోయే వింతలను గురించి వీరబ్రహ్మంగారు తెలిపారు. అప్పటిలో బనగానపల్లె నవాబుకు తన మహిమలను చూపారు. అనంతరం కడప జిల్లా, బద్వేలు తాలూకలోని మైదుకూరు నియోజకవర్గంలో వున్న కందిమల్లాయపల్లెకు(ప్రస్తుతం బ్రహ్మంగారిమఠం) చేరి అక్కడి గ్రామ పెద్దల సహకారంతో ఒక కుటీరాన్ని నిర్మించుకొని గ్రామ రైతాంగానికి నాగలి, కర్రు, మొదలైన వస్తువులు చేసి ఆదర్శ కార్మికుడైయ్యారు. రాత్రి వేళ్లల్లో స్ధానిక సమీప గ్రామాల ప్రజలకు వేదాంతం భోదిస్తూ భవిష్యత్తు కాలజ్ఞానం వినిపించేవాడు. శిశ్యులు దూదేకుల కులానికి చెందిన వారు దళితులు వున్నారు. దళితులు, దూదేకుల కులాలకు చెందిన వారు కూడా ఆయన శిశ్యులుగా చేర్చుకోవడం చెప్పుకోదగ్గ విషయం.

కడప జిల్లా, జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్ద కొమ్మెర్ల గ్రామానికి చెందిన శివకోటయ్య ఆచారి కుమార్తె గోవింద మాంబను వివాహమాడారు. మైదుకూరు నియోజకవర్గం ముడుమాల(సిద్దయ్య గారిమఠం)కు చెందిన దూదేకుల సిద్దయ్యను శిశ్యునిగా చేసుకొని పర్యటన కొనసాగించారు. కడప నవాబుకు తన మహిమలను చూపించి హిందూ, మహమ్మదీయుల ఐక్యతకు కృషి చేశారు. కంది మల్లాయపల్లెకు చెందిన దళితులు కక్కయ్యను తన శిశ్యునిగా చేర్చుకున్నారు. అనంతరం కాలజ్ఞానాన్ని దేశం నలుమూలల ప్రచారం చేసి సంఘ సంస్కర్తగా ఖ్యాతిని పొందారు. 16వ శతాబ్దంలో వైశాఖ శుద్ధ దశమి నాడు సజీవ సమాధి నిష్ట వహించి కలియుగ దైవంగా వెలుగొందారు. 1993లో కందిమల్లాయపల్లెలో సజీవ సమాధి అయ్యారు. భౌతికంగా మన మధ్య లేనప్పటికీ సజీవ సమాధి అయిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధి అయిన స్థలం నేడు బ్రహ్మంగారిమఠంగా ఒక పుణ్యక్షేత్రంగా వెలుగుతోంది. 

No comments:

Post a Comment