రాష్ట్రంలో 2004 నుంచి చేపట్టిన సంక్షేమ పథకాలు అక్షరాలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డివేనని, అవెంత మాత్రం కాంగ్రెస్ పార్టీవి కానే కావని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ పథకాలన్నీ కాంగ్రెస్‌వేనని, వైఎస్‌వి కావని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై భూమన మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ మొదలు ఫీజుల చెల్లింపు పథకం వరకూ కాంగ్రెస్ పథకాలే అయితే 2004 ఎన్నికల సందర్భంగా కాని, 2009లోగాని జాతీయ స్థాయిలో ఆ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టో(ప్రణాళిక)లో వీటిని ఎందుకు చేర్చలేదని కరుణాకర్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. పోనీ.. కనీసం ఏ ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనైనా ఇలాంటి పథకాలున్నాయేమో చెప్పండి అని ఆయన డిమాండ్ చేశారు.
పేదల కోసం వైఎస్ చేపట్టిన పథకాలకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నందుకే తమ పార్టీ జెండాలోనూ, ఎజెండాలోనూ వాటిని చేర్చామని ఆయన వివరించారు. పార్టీ పేరేమిటో చెప్పుకోలేని స్థితిలో ఉన్నారంటూ బొత్స చేసిన వ్యాఖ్యలకు భూమన అభ్యంతరం తెలుపుతూ.. ‘‘మాది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.. లక్షలాది మంది శ్రామికులు, కోట్లాది మంది రైతులు, మరెంతో మంది యువజనుల ఆశలను, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, ఆ వర్గాలన్నింటికీ ప్రాతినిధ్యం కల్పించే సమున్నతమైన పార్టీ అని మేం ధైర్యంగా చెప్పుకోగలం. ఏ పార్టీనైనా సంక్షిప్త నామంతో పిలుస్తారు, అలాగే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అని చెప్పుకుంటున్నాం.. అందులోనే వైఎస్సార్ పేరు కూడా ఇమిడి ఉంది...’’ అని ఆయన పేర్కొన్నారు.
మీది భారత జాతీయ కాంగ్రెస్ అని తెలుసా?
పీసీసీ అధ్యక్షుడైన బొత్సకు.. కాంగ్రెస్ పార్టీ పూర్తి పేరు ‘భారత జాతీయ కాంగ్రెస్’(ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) అనే విషయం తెలుసా? ఆ పేరును ఎపుడైనా ఉచ్చరించారా? 1885 సంవత్సరంలో ఆ పార్టీని ఏర్పాటు చేసిందెవరో బొత్సకు తెలుసా? అని భూమన నిలదీశారు. అసలాయనకు అంత రాజకీయ పరిజ్ఞానం ఎక్కడిదని అన్నారు. వైఎస్ చేపట్టిన ఏ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసేసిందో చెప్పాలని బొత్స అడగడం అర్థరహితమని ఆయన అన్నారు. ‘‘982 వ్యాధులకు చికిత్స చేయించేందుకు వీలుగా వైఎస్ రూపకల్పన చేసిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరు కారుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? శాశ్వత దుర్భిక్షం నుంచి విముక్తి కోసం ఉద్దేశించిన జలయజ్ఞాన్ని నీరుగార్చింది మీరు కాదా? ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకానికి తూట్లు పొడుస్తున్నది మీరు కాదా? ప్రజలకు 104, 108 పథకాలను అందుబాటులో లేకుండా చేస్తున్నది మీరు కాదా? అవి నిజంగా కాంగ్రెస్ పథకాలే అయితే మీరెందుకు అమలు చేయడం లేదు’’ అని ఆయన దుయ్యబట్టారు. కిలో రెండు రూపాయల బియ్యాన్ని 20 కేజీల నుంచి 30 కేజీలకు పెంచుతామని, వ్యవసాయరంగానికిచ్చే ఉచిత విద్యుత్‌ను 7 నుంచి 9 గంటలకు పెంచుతామని వైఎస్ ఇచ్చిన రెండు హామీలనూ నేటికీ ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
జగన్ నిష్కల్మషంగా బయటకొస్తారు
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసిందంటూ బొత్స చెప్పడం అసమంజసంగా ఉందని భూమన అన్నారు. ఏ తప్పూ చేయని, ఏనాడూ సచివాలయం వైపు కన్నెత్తికూడా చూడని జగన్‌పై అన్యాయంగా తప్పుడు కేసులు బనాయించారని, సీబీఐ పెట్టిన ఈ తప్పుడు కేసులపైనే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని భూమన వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్టానవర్గాన్ని జగన్ ధిక్కరించారన్న దుగ్దతోనే సీబీఐని ఉసిగొల్పి వేధిస్తున్నారని, నూటికి నూరు శాతం ఆయన నిష్కల్మషంగా బయటకు వస్తారని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఏర్పడిన తమ పార్టీపైనా, జగన్‌పైనా తెల్లారి లేచిన దగ్గరి నుంచి కాంగ్రెస్, టీడీపీలు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
టీడీపీ నేతలారా.. నియమావళి చదవండి..
జగన్ ములాఖత్‌లపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలన్నీ నూరుశాతం అబద్ధాలేనని, యనమల రామకృష్ణుడు జైలు నియమావళిని చదవకుండా రాద్ధాంతం చేస్తున్నారని కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరు జైలు అధికారులనే బెదిరించే విధంగా ఉందన్నారు. నిర్బంధంలో ఉన్న ఖైదీలా కాకుండా శిక్ష పడిన ఖైదీ మాదిరిగా వారానికి రెండుసార్లు మాత్రమే జైలు అధికారులు జగన్ ములాఖత్‌లకు అవకాశం కల్పిస్తున్నారని, ఇది చాలా అన్యాయమని, దీనిపై తాము తీవ్ర నిరసన తెలుపుతున్నామని భూమన అన్నారు.
జగన్‌కు వారానికి రెండుసార్లు మాత్రమే నలుగురేసి వ్యక్తులను కలుసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని, ఇది చాలా దారుణమని, ఆయనకు నిబంధనల ప్రకారం కూడా అవకాశం లేకుండా చేస్తున్నారని అన్నారు. ఇక్కడి నుంచి జగన్‌ను తరలించాలని కూడా కాంగ్రెస్, టీడీపీ నేతలు ప్రయత్నిస్తూ ఉన్నారని భూమన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
కిరణ్ కుట్రలో భాగమే ఇలాంటి కథనాలు
కృష్ణా పత్రిక వార్తలపై భూమన ఆగ్రహం
మాది నికార్సయిన లౌకిక పార్టీ
వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ మధ్య సయోధ్యకు మంతనాలు జరుగుతున్నాయని కృష్ణా పత్రిక ప్రచురించిన వార్తా కథనం వెనుక ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్ర ఉందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. తమది నికార్సయిన, నిక్కచ్చి అయిన లౌకిక పార్టీ అని, అందువల్ల ఇలాంటి పత్రికలు రాసే గాలి, నీలి వార్తలను పట్టించుకోవాల్సిన ఖర్మ తమకు పట్టలేదన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ అంశంపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ.. ‘పట్టుమని పది మంది కూడా డబ్బిచ్చి కొన ని, ఉచితంగా పంచి పెడుతున్న, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బినామీల చేత నడిపించే ఓ పత్రికలో కుట్రపూరితంగా రాయించుకునే కథనాలను మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. జగన్ రాజకీయ ప్రాబల్యాన్ని దెబ్బతీయడం కోసం కిరణ్ పన్నుతున్న కుట్రల్లో భాగంగానే ఇలాంటి కథనాలు రాయిస్తున్నారన్నారు. ఇలాంటి వార్తా కథనాలనే కొన్ని చానళ్లు పనిగట్టుకుని చూపిస్తున్నాయని, లక్షలాది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొన్న సాక్షి పత్రికను చూపించకుండా.. ఉచితంగా పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి బినామీ పత్రికను చానళ్లు తమ చర్చల్లో చూపిస్తున్నాయని, దాన్ని బట్టే ఇదంతా కుట్రపూరితంగా జరుగుతోందని తెలుస్తోందని ఆయన అన్నా

No comments:
Post a Comment