డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయింది. ఆయనప్రారంభించిన సంక్షేమపథకాలు ఒక్కొక్కటిగా తుది ఊపిరులు వదిలేయడం ప్రారంభించాయి.
పెద్ద వైద్యాన్ని పేదోడి ముంగిట్లోకి తెచ్చినందుకు గాను దేశంలో, దేశదేశాల్లో ప్రశంసలు పొందిన ఆరోగ్యశ్రీ ఆవిరైపోవడం మొదలైంది. కార్పొరేట్ల కట్టడిలో, ఖరీదు ఫీజుల ముట్టడిలో ఉన్న ఉన్నత విద్యను సామాన్యుడి సమక్షాన నిలబెట్టిన ఫీజు రీఇంబర్స్ మెంట్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడటం మొదలైంది. మహిళా స్వయంసహాయతా బృందాలకు పట్టం కట్టిన పావలా వడ్డీ నిర్లక్ష్యపు పాదాల కింద నలిగిపోవడం మొదలైంది. నేలకు జలకళ పంచిన భగీరథ యత్నం జలయజ్ఞపు హోమాగ్ని జ్వాలలపై నివురు కప్పేసింది. నీరసం కమ్మేసింది. ఇక వైఎస్ ఆర్ హయాంలో పండుగలా మారిన వ్యవసాయం మళ్లీ నష్టాల "వ్యయ"సాయం అయిపోయింది. కనీస మద్దతు ధర కనీసం కనిపించనైనా కనిపించకుండా పోయింది. వ్యవసాయ ఋణ సదుపాయం, సబ్సిడీల సపోర్టు మాయమైపోయాయి. ఒక్క వైఎస్ఆర్ లేకపోవడంతో రాష్ట్రం దిక్కులేనిదైంది. ప్రజ రెక్క తెగినదైంది. నలుదిక్కులా నల్లమేఘంలా నిరాశ కమ్ముకుపోయింది.
ఈ కారుచీకటిలోనే కాంతిరేఖల్లా వచ్చారు వైఎస్ జగన్, ఆయన స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సమయం సవాళ్లు విసిరినప్పుడే సమర్థుడు పిడికిలి బిగిస్తాడు. జగన్ కూడా అలాగే ముందుకొచ్చారు. ప్రజల్లో కునారిల్లిన విశ్వాసాన్ని, నలిగిపోయిన నమ్మకాన్ని, విరిగిపోయిన ఆశలను మళ్లీ చిగురింపచేయడమే తన కర్తవ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది.http://www.ysrcongress.com/article/Building_a_Better_State.html

No comments:
Post a Comment