పంచాంగం విషయాలు
పంచాంగం విషయాలు
- అక్షయ తృతీయ,విజయదశమి,కార్తీక మాసంలో శుక్లపక్ష పాడ్యమి రోజున సాయంత్రం వరకు సాడేతీన్ ముహూర్తములు అంటారు. ఈ దినములలో పంచాంగం చూడకుండానే ప్రతి శుభకార్యం ప్రారంభించవచ్చు.
- రాహు కాలంలో శుభకార్యాలు,గులికకాలంలోఆశుభకార్యాలు ప్రారంభించరాదు.
- తిధులు: రెండు పక్షములన్దున చవితి,షష్టి,అష్టమి,నవమి,ద్వాదశి,చతుర్ధశి తిధులలో మంచి పనులు మొదలుపెట్టకూడదు. అమావాస్య రోజు పితృ కర్మలు చేయవచ్చును.శుభ కార్యాలు చేయరాదు.
- గ్రహణం పట్టుచుండగా స్నానం,పూర్తిగా పట్టినపుడు జపము,విడచిన పిమ్మట స్నానం చెయ్యాలి. గ్రహణం తర్వాత ఏడు రోజులు ఎటువంటి శుభకార్యాలు చేయరాదు.
- ప్రయానమునందు అపశకునము కలిగిన కాళ్ళు కడుగుకొని, కాస్త విశ్రమించి, బెల్లమును తిని బయలుదేరాలి.
- శన్యూషః కాలం: అనగా శనివారం రోజు సూర్యోదయమునకు ముందు రెండు ఘడియల (నలుభది ఎనిమిది నిముషాలు)నుంచి సూర్యోదయం వరకు వుండే కాలాన్ని శన్యూషః కాలం అంటారు. ఆ సమయంలో ఏ మంచి పని మీద అఐ నను ప్రయాణం మొదలెడితే, ఆ పని తప్పక నెరవేరుతుంది. అంటే ఆ సమయంలో ప్రయాణం చెయ్యాలి.
No comments:
Post a Comment