ధర్మసంకటానికి జ్ఞానజ్యోతి భగవద్గీత
నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రతి ఇంటా చేయవలసిన భగవద్గీత పారాయణం చాలా మందికి సాధ్యపడని విషయం. అందుకే కనీసం రోజుకు రెండు గీతా శ్లోకాలు చదివితే జీవిత పరమార్ధం, గీతార్ధం అందరికీ అవగతమౌతాయి. (ద్వితీయోధ్యాయం- సాంఖ్యాయోగం)
శ్లోకంః గురూనహత్వా హి మహాసుభావాన్
శ్రేయో భోక్తుం భైక్ష మపీహలోకే
హత్వార్థ‚ కామాంస్తు గరూనిహైవ
భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్డాన్
మిక్కిలి ప్రభావం కలిగినవారూ, పెద్దలూ అయిన భీష్మ, ద్రోణాదులను సంహరించి అనుభవించే రాజ్యభోగములకంటే, వారిని అలాగే వదిలి నాకు రాజ్యమూ లేక, ఆడవుల తిరుగుతూ, భిక్షాన్నమే మేలనిపిస్తోంది. ఎందుకంటే, వారు రాజ్యభోగముల మీద ఆశ ఉన్నవారు. వారికి స్వయంగా ఆశలేకపోయినా, అట్టి ఆశాపీడితుడగు దుర్యోధనుని పక్షాన ఉండటం వల్ల వారిని కూడా ఆ దోషమావరించి ఉంది. యుద్ధంలో వారు మరణించుట నిశ్చయం. తర్వాత ఆ రాజ్యమును పొంది ఆయాస్థానాల్లో వారు భోగములు అనుభవించుచుం డెడివారు కదా! అనే జ్ఞాపకం వచ్చుచుండును. యుద్ధములో రక్తసిక్తములైన వారి దేహములు కనిపించు చుండును. అది దుఃఖము కలిగించుచుండును. ఈ యుద్ధము వలన లభించిన రక్తసిక్త భోగాల్ని నేనెలా అనుభవించగలను?
శ్లోకంః నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్
యచ్చోకముచ్ఛోషణ మింద్రియాణాం
అవాప్య భూమా వసపత్న మృద్ధం
రాజ్యం సురాణా మపి చాధిపత్యమ్
శ్రీకృష్ణా! ఇప్పుడు నాకు కల్గిన ఈ శోకము నా ఇంద్రియములన్నిటినీ ఎండించి, తీవ్రంగా తపింపచేయు చున్నది. ఇది తొలగు ఉపాయమేమిటో నాకు కనిపించడం లేదు. ఏమి చేసినచో ఈ శోకము చల్లారును? ఘోరమగు యుద్ధము ద్వారా శత్రుల్ని వధించి రాజ్యము నిష్కంట కముగా చేసి ఏలుకోవడం వల్లనా? లేక యుద్ధము మాని అస్త్రాలు విడిచి పర్యవసానంగా వారిచేతిలో చంపబడి స్వర్గాధిపత్యము పొందుటవల్లనా? బంధువులను వధిం చుటవల్ల రెండునూ తీర్చలేవని అనిపించుచున్నది.

No comments:
Post a Comment