1.వైఎస్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు బాబు కోర్ట్ లో కేసు ఎందుకు వేయలేదు?
వేసి ఉంటె వైఎస్ కూడా బాబు పై కేసులు వేసే వాడు అప్పుడు ఇప్పటిలాగా కాంగ్రెస్ సహకారం ఉండేది కాదు కాబట్టి కోర్ట్ లను మేనేజ్ చేయలేను ,దొరికి పోతాను అని భయపడ్డాడు బాబు.
2.నన్ను చంద్ర బాబు రహస్యంగా కలిసాడు అని చిదంబరం పార్లమెంటులో ప్రకటన చేసాడు కానీ బాబు నేను కలవలేదు అన్నాడు.కలిసాడు అనేది నిజం, ఆ విషయాన్నీ ఆంగ్ల పత్రికలు తాటికాయంత అక్షరాలోతో వ్రాసాయి కూడా.
బాబు అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరాన్ని కలిసిన వెంటనే జగన్ పై కోర్ట్ విచారణకు ఎందుకు ఆదేశించింది?
మరి బాబు చిదంబరాన్ని కలిసి జగన్ ను జైలు లో వేయండి, నా మీద కేసులు కొట్టేయండి అని
ప్రతిగా కాంగ్రెస్ ను కంటికి రెప్పలా కాపాడుతాను అని చెప్పలేదా?
3.విజయమ్మ పిటిషన్ వేస్తె బాబు మీద కోర్ట్ విచారణకు ఆదేశించినప్పుడు ఆగ్రహించిన బాబు సోనియా, రాబర్ట్ వద్రా, రాష్రానికి చెందినా 8 మంది మంత్రులు అవినీతికి పాల్పడినట్టు తన దగ్గర ఆధారాలు ఉన్నాయి ,కాబట్టి కోర్ట్ లో కేసు వేస్తున్నాము అని చెప్పాడు, చెప్పి కూడా దాదాపు రెండు సంవత్సరాలు అయింది.మరి బాబు ఎందుకు కేసు వేయలేదు?
కాంగ్రెస్ వాళ్ళు తో ఒక అవగాహనకు వచ్చి తనమీద కేసులు లేకుండా చేసుకోవడానికే కదా?
4.జగన్ మీద కేసు వేసిన శంకర్ రావు తను సోనియా ఆదేశాలమేరకు కేసు వేశానని రామోజీ ను కూడా కలిసానని కానీ ఎప్పుడు ఎందుకు అనేది మాత్రం చెప్పనని అన్నాడు.
మరి ఇదే శంకర్ రావు మీద అవినీతి ఆరోపణలు వస్తే తీదీపి కనీసం ఎందుకు మాట్లాడదు ?
శంకర్ రావు ను ఎమన్నా అంటే సోనియా, రామోజీ, చంద్రబాబు లు ఎలా కలిసి కుట్రపన్ని జగన్ ను కేసులలో ఇరికించింది మీడియా కు చెబుతాడనా ?
5.గతం లో సిబిఐ ని కాంగ్రెస్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ అన్న బాబు , న్యాయమూర్తులు కాంగ్రెస్ ఏజెంట్లు అన్న బాబు ( ద్రోణంరాజు సత్యనారాయణ అనే కాంగ్రెస్ లీడర్ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మీద కేసు వేస్తె 7 కేసులలో అవినీతికి పాల్పడ్డట్టు ప్రాధమిక ఆధారాలు ఉన్నాయి అని హై కోర్ట్ చెప్పినప్పుడు ఇదే బాబు కోర్టులను తిట్టాడు, న్యాయమూర్తులు కాంగ్రెస్ ఏజెంట్లు అన్నాడు రాష్ట్ర బందుకు పిలుపిచ్చి బస్సులు తగలపెట్టించాడు ) జగన్ మీద కేసు వచ్చేసరికి ధర్మం నాలుగు పాదాల నడుస్తుంది అంటున్నాడు.సరే అలాగే అనుకొందాము.
మరి అవిశ్వాసం పెట్టమంటే నేను అవిస్వాసం పెడితే జగన్ కాంగ్రెస్ తో బేరం కుదుర్చుకొని బెయిల్ తెచ్చుకొంటాడు అన్నాడు కదా అంటే బెయిల్ అనేది కోర్ట్ చేతిలో లేదు కాంగ్రెస్ చేతిలో మాత్రమే ఉంది అని బాబు ఒప్పుకున్నట్టే కదా!
అంటే జగన్ మీద కేసు రాజకీయ ప్రేరేపితము అని బాబు పరోక్షంగా చెబుతున్నట్టే కదా?
పొతే జగన్ రెండు సార్లు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చాడు, FDI వోటింగ్ లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జగన్ పార్టీ MP లు ఒటేసారు.
మరి జగన్ కాంగ్రెస్ తో ఎలా కలిసాడు? బాబు కదా కాంగ్రెస్ కు అంతర్గతంగా సహకరిస్తుంది
జైలు లో ఉందికూడా వత్తిల్లకు లొంగకుండా కాంగ్రెస్ పై సింహం లా పోరాటం చేస్తుంది జగన్ కాదా?
6.జగన్ మీద హై కోర్ట్ విచారణకు అదేసిన్చినప్పుడు జగన్ స్టే కు వెళ్ళకుండా కడిగిన ముత్యం లా కేసు లోంచి బైటకి రావాలి అన్న పెద్ద మనిషి బాబు తనమీద సిబిఐ విచారణకు కోర్ట్ అదేసిన్చేసరికి ఎందుకు పరుగెత్తుకెళ్ళి స్టే తెచ్చుకొన్నాడు?
తాను నిప్పు అని ఆంధ్ర హజారే అని చెప్పుకొనే నారా బాబు విచారణను ఎదుర్కొని క్లీన్ చిట్ తెచ్చుకోవచ్చు కదా?
తన అవినీతి ,అక్రమాలు బైతపదతాయని భయం కాకపోతే ఎందుకు స్టే తెచ్చుకొంతున్నాడు?
7. నాట్ బిఫోర్ బాబు.
ఈ మధ్య కోర్తులమీద అపారనమ్మకుముంది అంటున్న బాబు తన కేసులో నా కేసు ఆ న్యాయమూర్తి దగ్గరకు వద్దు,ఈ న్యాయమూర్తి దగ్గరకు వద్దు అని నలుగురు న్యాయమూర్తులను న్యాయవ్యవస్థ లో ఉన్న " నాట్ బిఫోర్" అనే ఉత్తమ సాంప్రదాయాన్ని వాడుకొని , బాబు CM గా ఉన్నప్పుడు ప్లీడర్ గా , న్యాయమూర్తిగా పదోన్నతి పొంది గతం లో బాబు కు అనుకూల తీర్పులు ఇచ్చిన వారి దగ్గరికే కేసు వచ్చేలా పావులు కదిపి కేసు కొట్టేయిన్చుకోవడము కాకతాళీయమా?
మరల బాబు పై ఉన్న IMG కేసు కూడా తిరిగి తిరిగి అదే న్యాయమూర్తి దగ్గరకు రావడం కూడా విచిత్రమే!
8.కాంగ్రెస్ ను కాపాడుతోంది చంద్ర బాబే అని బహిరంగంగా జేసి దివాకర్ రెడ్డి , బొత్స, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చెప్పింది నిజం కాదా ?
http://www.ysrcongress.net/2013/06/1.html?utm_source=feedburner&utm_medium=feed&utm_campaign=Feed%3A+ysrcongress%2FbYQB+%28YSR+Congress%29
No comments:
Post a Comment