Monday 10 June 2013

వైఎస్సార్సీపీ నేత పోరెడ్డిపై హత్యాయత్నం

6/10/2013 3:16:00 AM
పరస్పరం దాడి చేసుకున్న దుండగులు.. ఇద్దరు హతం
పోరెడ్డితో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

పులివెందుల/సింహాద్రిపురం, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింహాద్రిపురం మండల కన్వీనర్ పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డిపై ఆదివారం రాత్రి అగంతకులు దాడి చేశారు. దుండగులు తుపాకీతో కాల్పులు జరపగా తప్పించుకున్న పోరెడ్డి తోపాటు అనుచరులు ప్రాణ భయంతో ప్రత్యర్థులపై ఎదురుదాడికి దిగారు. ఈ గలాటాలో ముసుగులు ధరించిన అగంతకులు ఒకరిపై ఒకరు దాడి చేసు కోవడంతో వారిలో ఇద్దరు చనిపోయారు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో పోరెడ్డి తన బావమరిది చవ్వా రవిచంద్రారెడ్డి, అనుచరులు రామనాథరెడ్డి, రాజగోపాల్‌రెడ్డిలతో కలసి హిమకుంట్ల సమీపానఉన్న తోటలోని గెస్ట్‌హౌస్‌వద్ద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు వారిపై దాడులకు తెగబడ్డారు. వారిలో ఒకరు తుపాకీతో కాల్పులు జరిపాడు. తప్పించుకున్న పోరెడ్డి వర్గం దాడినుంచి తేరుకుని ప్రత్యర్థులపై ఎదురు దాడికి దిగేలోగా, ముసుగులో ఉన్న అగంతకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో వారిలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు పరారయ్యా రు.

అగంతకులు ముఖానికి ముసుగులు వేసుకుని వచ్చినట్లు గాయపడిన పోరె డ్డి వర్గానికి చెందిన వారు చెబుతున్నారు. కాగా, అగంతకుల దాడిలో పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయనతో పాటు బావమరిది రవి చంద్రారెడ్డి, అనుచరులు రామనాథరెడ్డి, రాజగోపాల్‌రెడ్డిలకు కూడా గాయాల య్యాయి. జమ్మలమడుగు డీఎస్పీ జాన్ మనోహర్, కొండాపురం సీఐ నరసిం హమూర్తి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఘటనకు సంబంధించిన అంశాలను పోరెడ్డితో మాట్లాడి తెలుసుకుని, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నా రు. పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డిపై దాడి జరిగిందని తెలియడంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లా మున్సిపల్ ఎన్నికల పరి శీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోరెడ్డితో సహా గాయపడిన వారిని తమ వాహనంలో ఎక్కిం చుకుని పులివెందులలోని ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. పోరెడ్డిపై హత్యాయత్నంవార్త తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రికి చేరుకున్నారు.
- See more at: http://www.sakshi.com/main/FullStory.aspx?catid=615605&Categoryid=1&subcatid=33#sthash.7KOgzawR.dpuf

No comments:

Post a Comment